తెలంగాణ గంగ మూసి నదిని పరిరక్షించాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నేడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రితో భేటీ అయ్యారు. నమామి గంగ తరహాలో మూసీ నది ప్రక్షాళనకు కార్యక్రమాలను చేపట్టాలని ఆయన అన్నారు. మూసి ప్రక్షాళనలో భాగంగా కాలుష్య నియంత్రణ కోసం ట్రిట్ మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
అదే విధంగా మూసి నది ఒడ్డున విరివిగా చెట్ల పెంపకాన్ని చేపట్టాలని ఆయన కోరారు. మూసిని కలుషితం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్ర మంత్రిని కోరారు. మూసి పై నిర్మించిన అక్రమాల నిర్మాణాలను తొలగించాలని, పరిశ్రమలు మూసిని కలుషితం చేయకుండా చర్యలు చేపట్టాలని కోరారు.