40.2 C
Hyderabad
April 29, 2024 18: 13 PM
Slider నల్గొండ

మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి: సిఐటియు

#roshapati

మున్సిపల్ ఉద్యోగ కార్మికులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు మార్చి 28,29 తేదీలలో జరిగే సార్వత్రిక సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి కోరారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కార్మికుల సమావేశంలో పాల్గొన్న శీతల రోషపతి మాట్లాడుతూ లాక్ డౌన్ కరోనా కష్ట కాలంలో పనిచేసిన మున్సిపల్ కార్మికుల ఐకెపి,మెప్మా ఉద్యోగుల మాదిరిగానే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనం ఇవ్వాలని,ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి  కనీసం వేతనం నెలకు 26 వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడులను రద్దు చేయాలని,రాష్ట్రంలో కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి, అందరినీ పర్మినెంట్ చేయాలని,ఈఎస్ ఐ హాస్పిటల్ సౌకర్యం హుజూర్ నగర్ లో ఏర్పాటు చేయాలని, అర్హులైన కార్మికులకు డబల్ బెడ్రూమ్ ఇవ్వాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో సి ఐ టి యు జిల్లా కార్యవర్గ సభ్యులు ఎలక సోమయ్య గౌడ్,మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష్య,కార్యదర్శులు మేరిగ దుర్గారావు,కస్తాల ముత్తమ్మ, కస్తాల సైదులు,కుమారి,రామగోపి, చంద్రమ్మ, ఎల్లమ్మ, సంతోషం, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

చిన్నంబాయిలో కోర్టు ఏర్పాటు చేయాలని వినతి

Satyam NEWS

రాజన్న రాజ్య స్థాపనకు రాజీలేని పోరాటం చేద్దాం

Satyam NEWS

నిజాం తరహా కేసీఆర్ పాలనను తరిమి కొట్టాలి

Satyam NEWS

Leave a Comment