24.7 C
Hyderabad
May 16, 2024 23: 32 PM
Slider సంపాదకీయం

ఓటమి భయంతో ఫేక్ సర్వే ఫలితాలు..

#jaganmohan

గత అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన అధికార వైసీపీకి ఈ సారి ఓటమి భయం వెంటాడుతోంది. ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో సీఎం జగన్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజల్లో రోజు రోజుకూ వ్యతిరేకత పెరుగుతోంది. దీనికి తోడు రాష్ట్రంలోని పలు నియోజక వర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై స్థానికంగా అసంతృప్తి.. అసమ్మతి పెరుగుతోంది. గడప – గడప కార్యక్రమాల్లో అధికార పార్టీ ప్రజా ప్రతినిదులు నిరసన సెగ ఎదుర్కుంటున్నారు. దీంతో కొంత మంది ఎమ్మెల్యేలు భయంతో మొహం చాటేస్తున్నారు.

30 మంది ఎమ్మెల్యేలు గడప గడప కార్యక్రమంలో సరిగా పాల్గొనడం లేదని.. వారు పద్దతి మార్చుకోకుంటే రానున్న ఎన్నికల్లో సీటిచ్చేది లేదని చెప్పినా.. అధినేత జగన్ హెచ్చరికలను సైతం బేఖాతరు  చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో అధికారంలోకి తిరిగి రావడం కష్టమని గ్రహించిన వైసీపీ ఐ – పాక్ సలహా మేరకు కొత్త ఎత్తుగడకు పథక రచన చేసింది. సాధారణంగా సర్వే నివేదికలను ప్రజలు కొంత వరకు నమ్ముతారు. అలాగే జ్యోతిష్య పండితులు చెప్పే జోస్యంను కూడా కొందరు నమ్ముతారు. సర్వేల నివేదికలు.. జ్యోతిష్య పండితులు జోస్యం ద్వారా ప్రజల్లో అధికార వైసీపీ పట్ల అనుకూల  ప్రభావం ఏర్పడి తద్వారా ఓటింగ్ శాతాన్ని పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది.

ఈ నేపద్యంలో కొన్ని సంస్థలు రాష్ట్రంలో సర్వేలు నిర్వహించినట్లు.. ఆ నివేదికల్లో అధికార పార్టీ తిరిగి   విజయం సాధిస్తుందనే విజయాన్ని వైసీపీ వ్యూహం ప్రకారం .. ఆ సమాచారాన్ని సొంత సోషల్ మీడియా, పార్టీ సోషల్ మీడియా  ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రజలను మభ్య పెడుతోంది. గత నెలలో ఢిల్లీకి చెందిన మీడియా సంస్థలు సర్వే నిర్వహించి విడుదల చేసిన ఫలితాలను వైసీపీ తమ మీడియాతో పాటు అనుకూల పెయిడ్ మీడియాతో ప్రసార మాధ్యమాల ద్వారా వూదర గొట్టించింది.

అలాగే తాజాగా  పోల్ స్ట్రాటజీ గ్రూప్.. ఏపీ రాజకీయాలపై ఓ సర్వేను నిర్వహించిందనీ… వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేదెవరనేది తేల్చి చెప్పిందనీ .. ఈ సర్వే సంస్థ. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే    అధికార వైసీపీ అధికారంలోకి వస్తుందని, జగన్  ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠిస్తారనేది స్పష్టం చేసింది. అంతే గాకుండా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి పడే ఓట్ల శాతం.. 49. 49 శాతం మేర ఓట్ల తేడాతో వైసీపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వే తేల్చింది. ఇదంతా వైసీపీ తనకు అనుకూలంగా పథకం ప్రకారం చేస్తోన్న ప్రచారమని జనం కొట్టి పారేస్తున్నారు.

ఇదిలా వుంటే ప్రజలకు జ్యోతిష్యం పై వున్న సెంటిమెంట్ ను క్యాష్ చేసుకునేందుకు సరికొత్త వ్యూహ రచన చేసింది. ఈ నేపద్యంలో అస్మదేయ జ్యోతిష్యులతో పాటు పెయిడ్ జ్యోతిష్య పండితులతో ఎన్నికల ఫలితాల జ్యోస్యం చెప్పించడం మొదలు పెట్టింది. సీఎం జగన్ కు గ్రహ స్థితులు అనుకూలంగా ఉన్నాయని, తిరిగి ఆయనే సీఎం అవుతారని పలువురితో జోస్యం చెప్పించడం జరిగింది. జ్యోతిష్యులు చెప్పిన జాస్య్యాన్ని జనం నమ్మి తమకు అనుకూలంగా ఒట్లేస్తారని వైసీపీ భావిస్తోంది. అయితే జనం తెలివి మీరి పోయారు.

సర్వేలు.. జ్యోస్యం అధికార పార్టీ చేసే జిమ్మిక్కులు అని తెలుసు కొలేని అమాయకులు కాదు. అధికార పార్టీ ఓటమి భయంతోనే ఇలాంటి చీప్ ట్రిక్ లు ప్రదర్శిస్తోందని… ఎన్ని సర్వేలు చెప్పినా.. ఎందరు జ్యోస్యం చెప్పినా లాభం లేదని ఈ సారి ఎన్నికల్లో అధికార వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లేసి సీఎం జగన్ రెడ్డిని గద్దె దింపాలని నిశ్చయించుకున్నారు.

Related posts

లాల్ దర్వాజా బోనాల జాతర.. పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రులు

Bhavani

పార్టీ అభివృద్ధికి శక్తివంచనలేకుండా కృషి చేయాలి

Satyam NEWS

న్యాయస్థానాలపై ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు

Satyam NEWS

Leave a Comment