34.2 C
Hyderabad
May 16, 2024 18: 16 PM
Slider ఆదిలాబాద్

ఆదిలాబాద్ అడవుల్లో ఏ క్షణాన ఏమి జరుగుతుందో

#AdilabadForest

కడంబ, పూసుగుప్ప, దేవర్లగూడ, చర్ల ఎన్‌కౌంటర్లకు నిరసనగా మావోయిస్టులు పిలుపునివ్వడంతో నేడు బంద్ విజయవంతంగా సాగుతున్నది.

అయితే ఎక్కడ ఏం జరుగుతుందోననే టెన్షన్ అందరిని ఆందోళన పరుస్తున్నది. మావోల బంద్ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.

మహారాష్ట్ర – ప్రాణహిత – తెలంగాణ సరిహద్దులో పోలీస్ తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మావోల బంద్ నేపథ్యంలో తిర్యాణీ, పెంబి, కవ్వాల్, కడంబ అడవుల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.

ఏ క్షణాణ ఏం జరుగుతుందో తెలియక సరిహద్దు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.

కడంబ ఎన్ కౌంటర్ ను ఖండిస్తూ బూటకపు ఎన్ కౌంటర్ కు ప్రతికారం తీర్చుకుంటామంటూ జగన్ పేరిట విడుదలైన లేఖతో పోలీసులు‌ మరింత అప్రమత్తమయ్యారు. బెజ్జూర్, పెంచికల్ పేట, కోటపల్లి, వేమనపల్లి, గూడెం – అహేరీ, అర్జునగుట్ట – సిర్వంచ మధ్య పోలీసు తనిఖీలు ముమ్మరమయ్యాయి. డ్రోన్ కెమెరాల సాయంతో పోలీసులు అడవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు.

Related posts

పాకిస్తాన్ ఆర్మీ ట్రైనింగ్ .. వెల్లడించిన టెర్రరిస్ట్..

Sub Editor

కొత్త అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు

Satyam NEWS

స్నాక్స్ టైమ్: పదవ తరగతి విద్యార్థులకు అల్పాహారం

Satyam NEWS

Leave a Comment