27.7 C
Hyderabad
May 14, 2024 10: 02 AM
కవి ప్రపంచం

గీతాల సూర్యుడు

#Vavilipally Rajarao SP

ఓ సంగీత సార్వభౌముడా

గీతాల భాస్కరుడా

ఎల్లలు దాటి ప్రవహించింది

నీ గానామృతం

మోడును చిగురింప చేయగలవు శిలను కరిగింపగలవు

నదీ ప్రవాహం నిలపగలవు

శిశువులచే నాట్యమాడించగలవు

పశువులచే పాట పాడించగలవు

ఇంద్రజాలం నీ రాగ సుధ

మనోహరం నీ గాత్రదానం

ప్రతి గుండెను రంజింప చేసింది

నీ మధుర స్వరం

నలుబది వేల గీతాలాపన గావించి

నరుని శిరం సై నిలిచావు శ్రీపాద పండితారాద్యుల

జాతి గుండెలో నిలిచావు శాశ్వతంగా

అందుకో మా వినమ్ర జోహార్లు !

వావిలిపల్లి రాజారావు, పొందూరు

Related posts

జాతి మెచ్చిన మహానేత

Satyam NEWS

అసామాన్యుడతడు

Satyam NEWS

మనిషికి రెండు వైపులా

Satyam NEWS

Leave a Comment