గుంటూరులో పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు లభ్యం కావడం కలకలం రేపింది. నల్లపాడు పరిసర ప్రాంతంలో డ్రగ్స్ కేంద్రాన్ని పోలీసులు గుర్తించారు. ఓ అపార్ట్‌మెంటులో రహస్యంగా మాదక ద్రవ్యాలు ఆన్‌లైన్‌లో విక్రయాలు చేస్తున్నారు. వీరిని నల్లపాడు సిఐ వీరాస్వామి వలపన్ని పట్టుకున్నాడు. డ్రగ్స్ తయారీకి సంబంధించి సౌదీ దేశస్తుడు షాజీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షాజీ ప్లాట్‌లో బొమ్మ చేతులు, గ్లౌజ్‌లు, ముఖం మాస్క్‌లు లభ్యమయ్యాయి.
previous post