ప్రభుత్వం నుండి మంజూరైన కల్యాణ లక్ష్మీ చెక్కులను కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల లబ్ధిదారులకు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పంపిణీ చేశారు. శనివారం ఉదయం కొల్లాపూర్ పట్టణం ఎమ్మెల్యే స్వగృహంలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ఎక్బాల్ అధ్యక్షతన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఎంపీపీ గాదెల సుధారాణి, జెడ్పిటిసి జూపల్లి భాగ్యమ్మ కల్యాణ లక్ష్మీ లబ్ధిదారులకు అందచేశారు. కొల్లాపూర్ 50, పెంట్ల వెళ్లి 18, విపన గండ్ల 19 మందికి పంపిణీ చేశారు. అనంతరం మధ్యాహ్నం పేద్దకొత్త పల్లి మండల లబ్ధిదారులకు మంజూరైన 72 కల్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దకొత్తపల్లి జడ్పీటీసీ మేకల గౌరమ్మ, వెన్నచెర్ల మాజీ సర్పంచ్ పవన్ కుమార్ శర్మ, బీరం రాజారెడ్డి, లక్ష్మయ్య, వడ్ల కొండయ్య, జనార్దన్, కమరి శివ, కటిక శివాజీ, తెలుగు అర్జునయ గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
previous post