34.2 C
Hyderabad
May 16, 2024 18: 27 PM
Slider ముఖ్యంశాలు

కేసుల పరిష్కారం తర్వాతే  ముందకు

#parliament

గిరిజన రిజర్వేషన్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. తెలంగాణలో గిరిజన రిజర్వేషన్లను పెంచుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టులో ఉన్న కేసుల పరిష్కారం తర్వాతే గిరిజన రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.  ఈ మేరకు లోక్‌సభలో తెరాస ఎంపీ రంజిత్‌ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్‌ ముండా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.  తెలంగాణలో గిరిజన రిజర్వేషన్లు పెంపునకు సంబంధించిన బిల్లు కేంద్ర ప్రభుత్వానికి అందింది. ఆ రిజర్వేషన్లను 10 శాతం వరకు పెంచాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లు కేంద్ర హోం శాఖకు చేరింది. రిజర్వేషన్లకు సంబంధించిన కొన్ని కేసులు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. అత్యున్నత న్యాయస్థానంలో కేసుల పరిష్కారం తర్వాతే దీనిపై ముందకు వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది’ అని కేంద్ర మంత్రి అర్జున్ ముండా లోక్‌సభలో వెల్లడించారు.

Related posts

స్వార్థ రాజకీయాలు పెరిగిపోతున్నాయి

Satyam NEWS

గుడ్ వర్డ్: అమ్మ ఆనందం కోసం మీరు కష్టపడి చదవండి

Satyam NEWS

ఆశగా ఎదురుచూస్తున్న”బడి”

Satyam NEWS

Leave a Comment