40.2 C
Hyderabad
May 5, 2024 15: 34 PM
Slider ప్రత్యేకం

‘వారాహి’ వాహనం పై అభ్యంతరం లేదు 

#ajay

జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార వాహనం వారాహి వివాదంపై తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  స్పందించారు. డిసెంబర్ 9వ తేదీన హైదరాబాద్ లోని టోలి చౌకి నందు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న వారాహి వాహనానికి TS13EX 8384 నంబర్ కేటాయించినట్లు తెలిపారు. వారాహి వాహనానికి రవాణా శాఖకు సంబంధించిన అన్ని అనుమతులు ఉన్నాయని  వెల్లడించారు. కొన్ని రోజుల క్రితమే వారాహి వాహనం రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకుందని తెలిపారు. వాహనం బాడీకి సంబంధించిన సర్టిఫికెట్ ను పరిశీలించామని పేర్కొన్నారు. అలాగే వారాహి వాహనం రంగు ఎమరాల్డ్ గ్రీన్ గా నిర్ధారించామని ఈ మేరకు  వాహనం ఆర్ సీ మీద దీని వివరాలు ముద్రించినట్లు మంత్రి  ప్రకటించారు. వాస్తవానికి వాహనాల రంగులకు కోడ్స్ ఉంటాయి అని భారత ఆర్మీ సంస్థ ఉపయోగించే కలర్ కోడ్ అంటే ఆర్మీ కలర్ 7B8165 కాగా, ఇప్పుడు జనసేన అధినేత ఎన్నికల వాహనం వారాహి కలర్ కోడ్ 445c44 అని పేర్కొన్నారు. ఈ క్రమంలో వారాహి వాహనం రంగుపై ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. జనసేన వాహనం రంగు ‘ఆలివ్ గ్రీన్’ కాదని, ‘ఎమరాల్డ్ గ్రీన్’ అని రవాణా శాఖ మంత్రి స్పష్టత ఇచ్చారు. ఇది నిబంధనలకు లోబడే ఉందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.

Related posts

జగన్ రెడ్డికి రఘురాముడిని బహిష్కరించే దమ్ముందా?

Satyam NEWS

ప్రైవేట్ బ‌స్సుల‌కు ప్ర‌తినెల కోట్లు చెల్లింపులు..

Satyam NEWS

ట్రాజెడీ: నిద్రలోనే కన్నుమూసిన ముగ్గురు చిన్నారులు

Satyam NEWS

Leave a Comment