39.2 C
Hyderabad
April 28, 2024 13: 57 PM
Slider కవి ప్రపంచం

ఆశగా ఎదురుచూస్తున్న”బడి”

#KolipakaSrinivas

ఇన్ని రోజులుగా…

కరోనా వైరస్ కు మాస్కుతో

మొహం చాటేసిన ‘బడి’

ఇప్పుడు..

స్వేచ్ఛగా రెక్కలు విదిలించి

హుషారుగా సిద్ధమవుతోంది..!

పిల్లలు లేక మసకబారిన

చదువుల బడి ఇప్పుడు..!

తనువు నిండా సత్తువను నింపుకొని

బోసి నువ్వులను చిదించేందుకు

తదేకంగా తహతహలాడుతుంది.!!

పాఠశాల తరగతి గదులు..

ఇంతకాలం నాలుగు గోడల మధ్య

నిశ్శబ్దపు నిశీధులు అలుముకున్నవి

ఇప్పుడు.!

తొలి వేకువ కిరణాల ఛాయలతో

కొండంత ఆశగా ఎదురు చూస్తున్న

బడి చిన్నారులకు…

విజ్ఞానపు కాంతులు పంచడానికి

సుద్దముక్క,నల్లబల్ల

కలిసికట్టుగా కలుస్తామంటున్నవి.!

సప్పుడు లేని బడిగంట.

భావి భారత పౌరులకై

నూతన ఉత్తేజంతో..

కాలగమనానికి బాసటై

మార్గనిర్దేశం చేయాలనుకుంటుంది!

బుడిబుడి అడుగుల

నడకల తాకిడి లేక బడిపిల్లలకై

ఆట స్థలము ఆరాటపడుతుంది!

విరాజిల్లే సింగిడి వర్ణ శోభితాలతో

బడి బుడతల కోలాహలం కోసం

విశాలమైన హృదయముతో

కళ్ళను విప్పార్చి ఆశగా

ఎదురుచూస్తోంది చదువుల ‘బడి’

కొలిపాక శ్రీనివాస్, 9866514972, జిల్లా వరంగల్ రూరల్, మండలం దామెర, గ్రామం సింగరాజు పల్లి (తెలుగు స్కూల్ అసిస్టెంట్, జడ్.పి.హెచ్.ఎస్ దాశరధి చిన్నగూడూరు)

Related posts

మారుతున్న కాలానికి అనుగుణంగానే ఇంగ్లీష్ విద్య

Satyam NEWS

ఈ వర్షాకాలంలో సన్నరకం వరి మాత్రమే పండించాలి

Satyam NEWS

ఆకట్టుకునే విధంగా ప్రమిదలు

Murali Krishna

Leave a Comment