34.2 C
Hyderabad
May 16, 2024 17: 27 PM
Slider నల్గొండ

రాబోయే రెండు రోజులు రైతులు అప్రమత్తంగా ఉండాలి

#HeavyRains

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్లచెరువు మండలం పరిసర ప్రాంతాలలో గత రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నాయి. మరో రెండు రోజులు అధిక వర్షం కురిసే అవకాశాలు ఉండటం వల్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, మండలంలోని వివిధ పంటలను పరిశీలించిన వ్యవసాయ శాఖ అధికారి  శ్రీనివాస్ గౌడ్ తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు వర్షం ఏమాత్రం తెరిపిచ్చినప్పుడు పొలాలలో నీరు నిండకుండా చూసుకోవాలని, ముఖ్యంగా వర్షపు  నీరు ప్రత్తి, మిరప పొలాలలో  నీరు  ఉండకుండా చూసుకోవాలి అన్నారు. ఒకవేళ నీరు నిలబడితే మొక్క పోషకాలు నేల నుంచి పొందలేదని మరియు వేరు కుళ్ళు, ఎండు తెగులు వచ్చే అవకాశం ఉందని అన్నారు.

ఒకవేళ ఎక్కడైనా నీరు నిలబడ్డ ప్రాంతంలో మొక్క వడబడినట్లు కనబడితే వెంటనే ఒక లీటర్ నీటికి మూడు గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్ పొడి మందు మొక్క మొదలు ప్రాంతంలో పోసి ఎండు తెగుళ్ళను సమర్థవంతంగా నివారించవచ్చని  రైతులకు ఆయన తెలియజేశారు.

Related posts

మేడ్ ఫర్ ఈచ్ అదర్: జర్మనీ జూలియా సికింద్రాబాద్ స్వర్ణాకర్

Satyam NEWS

పర్యావరణ పరిరక్షణ భావితరాలకు కానుక

Satyam NEWS

కుడికిల్ల రైతుల భూములకు న్యాయమైన ప్యాకేజీ ఇవ్వాలి

Satyam NEWS

Leave a Comment