31.2 C
Hyderabad
February 14, 2025 20: 16 PM
Slider ప్రత్యేకం

మేడ్ ఫర్ ఈచ్ అదర్: జర్మనీ జూలియా సికింద్రాబాద్ స్వర్ణాకర్

kavitha invitation

ఇది ఒక చిన్న సక్సెస్ ఫుల్ లవ్ స్టోరీ: సికింద్రాబాద్ కు చెందిన స్వర్ణాకర్ కొన్నేళ్ల క్రితం ఉద్యోగ నిమిత్తం జర్ననీ దేశానికి వెళ్ళాడు. స్వర్ణాకర్ ఉద్యోగం చేస్తూనే, తెలంగాణ జాగృతి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. తెలంగాణ జాగృతి జర్మనీ విభాగం అధ్యక్షుడైన స్వర్ణాకర్, జర్మనీలో ఉన్న తెలంగాణ వాసులతో బతుకమ్మ, బోనాలతో పాటు, తరచుగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు.

స్వర్ణాకర్ కు జర్మనీలో తనతో పనిచేస్తున్న, అదే దేశానికి  చెందిన అమ్మాయి జూలియాతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అంతేకాదు వారి ప్రేమను ఇరువైపులా తల్లిదండ్రులు అంగీకరించారు. స్వర్ణాకర్-జూలియాల పెళ్లికి నిశ్చయించారు. ఈ నెల 22 న బేగంపేటలో భారతీయ  సాంప్రదాయం ప్రకారం జూలియా – స్వర్ణాకర్ ల వివాహం జరగనుంది.

తెలంగాణ జాగృతి జర్మనీ విభాగం అధ్యక్షులు స్వర్ణాకర్, జర్ననీ అమ్మాయి జూలియా మూడు ముళ్ల బంధంతో త్వరలో ఏడడుగులు వేయనున్నారన్నామాట. స్వర్ణాకర్, జూలియా హైదరాబాద్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవితను కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా జూలియా – స్వర్ణాకర్ లను మాజీ ఎంపీ కవిత అభినందించారు.

Related posts

మంత్రి పదవి నాకు వద్దు… ఎమ్మెల్యేగానే ఉండిపోతా…!

Satyam NEWS

విజయనగరం లో మరో ఇల్లాలు భాగోతం వెలుగులో కి…

Satyam NEWS

ఘనంగా తెలుగు సినిమా తల్లి పుట్టినరోజు పండుగ

Satyam NEWS

Leave a Comment