34.2 C
Hyderabad
May 16, 2024 16: 27 PM
Slider విజయనగరం

మెగా లోక్ అదాలత్ కక్షిదార్లకు భోజనాలు పెట్టిన ఖాకీలు..!

#vijaya

ఆక‌ట్టుకున్న విజ‌య‌న‌గ‌రం వ‌న్ టౌన్,రూర‌ల్ పోలీసులు  సేవా నిర‌తి…!

పోలీసులంటే క‌ఠిన పాషాణ  హృద‌యం క‌లిగిన వారు… ఖాకీల‌కు ద‌య‌,ప్రేమ‌,మ‌మ‌కారం, వాత్స‌ల్యం…క‌రుణ లాంటి గుణాలు ఉండ‌నే ఉండ‌వు. ఇవి…కేసును తీసుకున్న‌ప్పుడు..కానీ…అదే ఖాకీల‌లో లోలోప‌ల కరుణించే హృద‌యం..జాలిప‌డే గుండె…ఆదుకునే మ‌న‌స్త‌త్వం ఉంటుంద‌ని నిరూపించారు…విజ‌య‌న‌గ‌రం వ‌న్ టౌన్,రూర‌ల్ స‌ర్కిల్ ఇన్ స్పెక్ట‌ర్లు. వివ‌రాల్లోకి వెళితే… జిల్లా కోర్టులో ఇటీవ‌లే నిర్వహించిన మెగా లోక్ అదాలత్ కక్షిదార్లకు న్యాయవాది అంజనీకుమార్ ,విజయనగరం  వన్ టౌన్ , రూర‌ల్  పోలీసులు సంయుక్తంగా భోజనాలు ఏర్పాటు చేసి, అందరి మన్ననలు పొంద‌డమే కాక పోలీసులు అంటే కాఠిన్యం మ‌న‌స్కులు కార‌ని…సేవా త‌త్స‌ర‌త‌కు నిద‌ర్శ‌న‌మ‌ని ఆచ‌రించి చూపించారు.

విజ‌య‌న‌గ‌రం పూల్ బాగ్ లో కొత్త‌గా ఇటీవ‌లే నిర్మించిన‌ జిల్లా కోర్టు ప్రాంగణంలో మెగా లోక్ అదాలత్ జ‌రిగింది. ఈ మెగా లోక్ అదాలత్ లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుండి కక్షిదార్లు మరియు ప్రజలు వివిధ కోర్టుల్లో విచారణలో ఉన్న కేసుల్లోను, దర్యాప్తు దశలో ఉన్న కేసుల్లో రాజీ అయ్యేందుకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సాయంత్రం వరకు జరిగిన మెగా లోక్ అదాలత్ పాల్గొన్న కక్షిదార్లు, ప్రజలు మధ్యాహ్నం భోజనాలు నిమిత్తం ఇబ్బంది పడకుండా ఉండేందుకు గాను వారికి భోజనాలు ఏర్పాటు చేసేందుకు, ప్రముఖ న్యాయవాది అంజనీ కుమార్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. మంచి పని చేస్తే చేదోడుగా ఉండేందుకు ఎల్లప్పుడూ ముందు ఉండే విజయనగరం రూరల్ సిఐ టివి తిరుపతిరావు, వన్ టౌన్ సిఐ బి.వెంకటరావు కూడా తమవంతు సహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చి, అవసరమైన భోజన ఏర్పాట్లలో తమవంతు పాత్ర పోషించారు.

లోక్ అదాలత్ నిర్వహణ సమయంలో దూరంలో ఉన్న హోటల్స్ కు వెళ్ళలేక కక్షిదార్లు, ఫిర్యాదుదార్లు, వివిధ శాఖల నుండి వచ్చిన ఉద్యోగులు భోజనాలు చేసి, మంచి కార్యక్రమం చేపట్టిన అధికార్లు, న్యాయవాదిని అభినందించారు. సిఐలు, న్యాయవాది మరియు ఇతర అధికారులు స్వయంగా వడ్డన చేశారు. ఈ సేవా కార్యక్రమంలోసీఐల‌తో పాటు ఎస్ఐ లు గణేష్, భాస్కరరావు మరియు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

జూపల్లి రోడ్‌షో

Bhavani

[2022] Authentic Japan Hokkaido Weight Loss Pills How Much Weight Will Water Pills Help Me Lose

Bhavani

Tragedy: నలుగురి ఉసురు తీసిన కుటుంబ కలహాలు

Satyam NEWS

Leave a Comment