26.7 C
Hyderabad
May 12, 2024 10: 26 AM
Slider వరంగల్

మతాలు వేరైనా భావాలు ఒక్కటే

అయ్యప్ప స్వాములతో కలసి భిక్ష చేసిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

భారతదేశం సర్వ మతాలకు నిలయమని, సమానత్వంతో జీవించడమే మనందరి మతమని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని మణికంఠ కుటీరంలోని అయ్యప్ప స్వాములకు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా (అన్నదానం) భిక్ష చేసి మత సామరస్యాన్ని చాటుకున్నారు. అయ్యప్ప దీక్షదారులకు (అన్నదానం) భిక్ష చేపట్టిన తస్లీమా, వారి మధ్యలో కూర్చొని సహంపక్తి భోజనం చేశారు.

అనంతరం తానే స్వయంగా విస్తారాకులు తీశారు.
భారతదేశం విభిన్న సాంస్కృతిక, సాంప్రదాయాలకు ప్రతీక అని, మతాలు వేరైనా భావాలు భావాలు ఒక్కటేనని తస్లీమా అన్నారు. మతం కన్న మానవత్వం గొప్పదని, మనమంతా మనుషులమని,ఐక్యమత్యంగా ఉంటూ స్నేహ భావంతో మెలగాలని తస్లీమా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కుటీర గురు స్వామి రమేష్,స్వాములు తదితరుల ఉన్నారు.

Related posts

గ్రామీణులకు ఉపాధి లేకుండా చేస్తున్న బీజేపీ

Bhavani

అత్యంత వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి శాంతి కళ్యాణం

Satyam NEWS

మంత్రి పువ్వాడ ను కలిసిన ట్రైనీ ఐ‌పి‌ఎస్

Murali Krishna

Leave a Comment