32.2 C
Hyderabad
May 16, 2024 15: 03 PM
Slider ప్రత్యేకం

విజయనగరం పోక్సో కోర్ట్ సంచలన మైన తీర్పు….!

#depikaips

విజయనగరం జిల్లా న్యాయ స్థానం సంచలన మైన తీర్పు వెల్లడించింది. అదీ మైనర్ బాలికపై అత్యాచారం కేసులో జిల్లా లో పోక్సో చట్ట ప్రకారం నిందితుడికి 20 ఏళ్ళు కఠిన కారాగార శిక్ష తో పాటు 5వేలు జరిమానా విధించింది. ఈ మేరకు కేసు పూర్వపరాలను జిల్లా ఎస్పీ దీపికా తెలిపారు. ఈ కేసును చీపురుపల్లి డి.యస్.పి ఎ. యస్. చక్రవర్తి  ఈ కేసును ప్రావీణ్యత  కేసుగా తీసుకొని చీపురుపల్లి యస్. ఐ మరియు సిబ్బంది కి సూచనలు అందిస్తూ ముద్దాయికి శిక్ష పడుటకు ట్రయిల్ సమయంలో బాధ్యత తీసుకున్నారు.

పోక్సో కేసులో నిందితుడికి  376 ఐపీఎస్ సెక్షన్ కి  10 ఏళ్ళు కఠిన కారాగార జైలు శిక్ష మరియు 1000/- జరిమానా…అలాగే 354(డీ)ఐపీఎస్ కి గాను ఏడాది పాటు సాదారణ జైలు శిక్ష  500/- జరిమానా…ఇక  354(ఏ)(టూ) ఐపీఎస్ సెక్షన్ కి గాను ఏడాది పాటు సాదారణ జైలు శిక్ష మరియు 500 జరిమానా..దాంతో పాటు అండర్ సెక్షన్ పోక్సో చట్ట ప్రకారం 20 ఏళ్ళు పాటు కఠిన జైలు శిక్ష  2000/- జరిమానా… అలాగే దాంతో పాటు అండర్ సెక్షన్ 12 పోక్సో చట్ట ప్రకారం  ఏడాది పాటు జైలు శిక్ష మరియు 500 జరిమానా… మొత్తానికి సదరు నేరానికి గాను ఏకకాలంలో 20 ఏళ్ల పాటు కఠిన కారాగార శిక్షతో పాటు 5000/- జరిమానా చెల్లించాలని పేర్కొన్నారు.

కేసు వివరాల్లోకి వెళితే….విజయనగరం జిల్లా చీపురుపల్లి పోలీసు స్టేషనులో 2018 లో నమోదైన సెక్షన్ 35/2021, క్రైమ్ నెంబర్ 46/ 2018 U/S 376,354(D),354(A)(ii),506 IPC and Sec 5 R/W 6 & 11 R/W 12 of POCSO Act- 2012 పోక్సో కేసులో నిందితుడైన గరివిడి మండలం, గరివిడి గ్రామం ఫేకర్ క్వార్టర్స్ కి చెందిన కాకర్లపూడి రామ్ కుమార్ వర్మ కు (వయస్సు 24 సం.లు)కు 20 సంవత్సరాల పాటు కఠిన కారాగార జైలు శిక్ష మరియు , 5000/-లు జరిమానా విధిస్తూ విజయనగరం ప్రత్యేక పోక్సో న్యాయస్థానం శిక్ష విధిస్తూ నవంబరు 16 న తీర్పు వెల్లడించిందని జిల్లా ఎస్పీ ఎం.దీపిక తెలిపారు.

నిందితుడు కాకర్లపూడి రాంకుమార్ వర్మ (24 సం||లు) మైనరు బాలికపై ప్రేమ పేరుతో అసభ్యకరంగా ప్రవర్తించి, బెదిరించి, పలుమార్లు లైంగిక నేరంకు పాల్పడడంతో చీపురుపల్లి పోలీసు స్టేషనులో పోక్సో చట్టం ప్రకారం అప్పటి ఎస్ఐ టీ. క్రాంతి కుమార్  కేసు నమోదు చేయగా.. అప్పటి ఎస్పీ గౌతమీ షాళీ ,బొబ్బిలి డీఎస్పీ సౌమ్యలతలు సకాలంలో దర్యాప్తు పూర్తి చేసి, నిందితుడిని అరెస్టు చేసి, న్యాయ స్థానంలో అభియోగ పత్రం దాఖలు చేసారన్నారు.

ఈ కేసులో ప్రాసిక్యూషను త్వరతిగతిన పూర్తి చేసి నిందితుడికి శిక్షపడే విధంగా చర్యలు చేపట్టామన్నారు. నిందితుడు కాకర్లపూడి రాంకుమార్ వర్మ పై నేరం రుజువు కావడంతో స్పెషల్ జడ్జి ఫర్ పోక్సో కోర్టు జడ్జి కె. నాగమణి గారు నిందితుడికి ఇరవై ఏళ్ల పాటు కఠిన జైలు శిక్ష, మరియు  5000/-ల జరిమాన విధిస్తూ తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలిపారు. ఈ కేసులో పోలీసువారి తరుపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటరు మావూరి శంకరరావు వాదనలు వినిపించగా, చీపురుపల్లి పోలీసు స్టేషన్ యస్.ఐ ఎ. సన్యాసి నాయుడు కోర్టు హెడ్ కానిస్టేబులు వేణు నాయుడు, రైటర్ వెంకటరమణ కానిస్టేబుల్ వెంకటరావు సాక్షులను సకాలంలో కోర్టులో హాజరు పరుస్తూ కోర్టు విచారణ కాలంలో బాధ్యత గా వ్యవహరిస్తూ ముద్దాయికి శిక్షపడేలా చేయగా, ఈ పోక్సో కేసులో త్వరితగతిన నిందితుడికి శిక్ష పడే విధంగా వ్యవహరించిన దర్యాప్తు అధికారులు, ప్రాసిక్యూషన్ అధికారులు మరియు చీపురుపల్లి యస్.ఐ మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎం.దీపిక అభినందించారు.

Related posts

నవయుగ వైతాళికుడు మహాత్మా జ్యోతిరావు పూలె

Satyam NEWS

పొరపాట్లకు ఆస్కారం ఇవ్వొద్దు: జిల్లా ఎన్నికల అధికారి

Satyam NEWS

ఫాక్ట్ ఫైండింగ్: ధాన్యం అమ్మే రైతులకు సౌకర్యాలు లేవు

Satyam NEWS

Leave a Comment