40.2 C
Hyderabad
May 6, 2024 19: 01 PM
Slider విజయనగరం

బస్తీ వాసులతో విజయనగరం ఖాకీల మమేకం..!

#civenkatrao

విజయనగరం జొన్నగుడ్డిలోని ప్రజలకు నేరాల నియంత్రణ, నేరస్తుల పట్ల అప్రమత్తం చేసేందుకు  జిల్లా పోలీసు బాస్ ఆదేశాలు….డీఎస్పీ సూచనలతో వన్ టౌన్ పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వన్ టౌన్  సీఐ డా. బి.వెంకటరావు మాట్లాడుతూ నేరస్తులు, ప్రస్తుతం జరుగుతున్న నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. నేరస్తులు విభిన్న రీతుల్లో నేరాలకు పాల్పడుతున్నారు అని అన్నారు. కావున, ప్రజలు అపరిచిత వ్యక్తులు పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానాస్పద వ్యక్తుల సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసు స్టేషనుకు లేదా డయల్ 100కు సమాచారం అందించాలన్నారు. పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పట్ల పిల్లకు అవగాహన కల్పించారు. పిల్లల ప్రవర్తన, వారు ఎక్కడికి వెళ్తున్నది కన్నవారు దృష్టి పెట్టాలన్నారు. అవసరమైన సమయంలో పోలీసుల సహాయం పొందేందుకు వెనుకాడ వద్దని ప్రజలకు వన్ టౌన్ సీఐ డా. బి.వెంకటరావు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వన్ టౌన్ ఎస్ఐలు ఎస్.భాస్కరరావు, అశోక్ కుమార్, రామ గణేష్, ఆర్.గోపాల్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Related posts

మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు సంఘీభావంగా బీసీ ల దీక్ష

Satyam NEWS

పారదర్శకత లేని జగన్ ప్రభుత్వం

Satyam NEWS

సర్ప్రైజ్ విజిట్: ప్రసూతి ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచాలి

Satyam NEWS

Leave a Comment