34.2 C
Hyderabad
May 16, 2024 17: 10 PM
Slider విజయనగరం

ఈ సారి  కూడా”స్పందన” కు 33 ఫిర్యాదులు

#spdeepika

బాధితులకు సత్వర న్యాయం: విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక

విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు  జిల్లా ఎస్పీ ఎం.దీపిక “స్పందన” కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో జూమ్ కాన్ఫరెన్సులో మాట్లాడి, వాటిని పరిష్కరించేందుకు చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని, ఫిర్యాదు దారులకు న్యాయం చేయాలని సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. “స్పందన” కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ గారు 33 ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

వాటి వివ‌రాలివే…

జామి మండలం భీమసింగి కి చెందిన ఒక మహిళ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన భర్త పేరున గల వ్యవసాయ భూమిలో వరి నారు పనులు చేస్తుండగా తమ భాగారులు వచ్చి, దౌర్జన్యం చేసారని, తమ భూమి ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తున్నారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట ప్రకారం చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని ఎస్.కోట సిఐను జిల్లా ఎస్పీ ఆదేశించారు.

గంట్యాడ మండలం కొండ తామరాపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన తండ్రి నుండి సంక్రమించాల్సిన వ్యవసాయ భూమిని తన సోదరుడు తమకు చెందకుండా చేస్తున్నాడని, కొంత మంది అధికారుల సహకారంతో భూమిని తన పేరున మార్పు చేసుకున్నాడని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ భూమి పత్రాలను పరిశీలించి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని, గంట్యాడ ఎస్ఐను ఆదేశించారు.

విజయనగరం పట్టణానికి చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ, తన అక్క కుమారుడు, అతని భార్య కుటుంబ సభ్యులు, స్నేహితులు తన భర్త పేరున ఉన్న ఆస్తులను తమ పేరున వ్రాయాలని, లేకుంటే చంపుతామని బెదిరిస్తున్నారని, వారి నుండి తనకు ప్రాణ భయం ఉన్నట్లు, వారిపై చర్యలు తీసుకొని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని, 1వ పట్టణ సిఐను ఆదేశించారు.

రేగిడి ఆమదాలవలస మండలంకు చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ, తన భర్త మరియు ఇతర బంధువులు తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తూ, అదనంగా కట్నం తెమ్మనమని డిమాండు చేస్తున్నారని, తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని రాజాం రూరల్ సిఐను జిల్లా ఎస్పీ ఆదేశించారు.

కొత్తవలస మండలం డాబాల కొత్తవలసు చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి  ఫిర్యాదు చేస్తూ, తన అపార్టుమెంటు సెక్రటరీ తన ఇంటికి తాగు నీరు, విద్యుత్ రాకుండా చేస్తూ, ఇబ్బందులకు గురి చేస్తూ, వేధింపులకు పాల్పడుతున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ ఇరు వర్గాలను పిలిపించి, మాట్లాడాలని, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని కొత్తవలస సిఐ ఆదేశించారు.

స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, 7 దినాల్లో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను తనకు వెంటనే నివేదించాలని అధికారులను జిల్లా ఎస్పీ ఎం.దీపిక ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఇన్చార్జ్ డిఎస్పీ టి. త్రినాధ్, డిసిఆర్బి సిఐ డా  బి.వెంకటరావు, ఎస్బీ సీఐ జి. రాంబాబు, ఎస్ఐలు వాసుదేవ్, లోకేశ్వరరావు, రమేష్ ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

ఇంప్రీచ్ రైట్స్:వ్యక్తి గత స్వేచ్ఛను హరిస్తున్నామీడియా

Satyam NEWS

67 మంది టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు…!

Bhavani

సినీనటుడు రాజశేఖర్ డ్రయివింగ్ లైసెన్సు రద్దు

Satyam NEWS

Leave a Comment