40.2 C
Hyderabad
April 29, 2024 17: 56 PM
Slider హైదరాబాద్

కార్యకర్తలను కడుపులో పెట్టి చూసుకుంటా: బండారి లక్ష్మారెడ్డి

#bandari

కార్యకర్తలను కడుపులో పెట్టి చూసుకుంటాననీ ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం ఉప్పల్ నియోజకవర్గం, మల్లాపూర్ డివిజన్, విఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో, బి ఆర్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల మారయ్య , వైస్ ప్రసిడెంట్ హమాలి శీను  అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఉప్పల్ నియోజకవర్గ కార్మికుల ఆత్మీయ సమ్మేళనానికి, ముఖ్య అతిథులుగా ఉప్పల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి  మాట్లాడుతూ కార్యకర్తలను కడుపులో పెట్టి చూసుకుంటానన్నారు. కేసీఅర్ నాయకత్వంలో కార్మికులకు ప్రోత్సాహకంగా అత్యధిక జీతాలు ఇస్తూన్న రాష్ట్రం తెలంగాణ అని గుర్తుచేశారు. కేసీఆర్ పాలనలో కార్మికులు సంతోషంగా ఉన్నారన్నారనీ,  కార్మికులతో నాకు ప్రత్యేక అనుభందం ఉందంటూ, కార్మికులను మా ట్రస్ట్ ద్వారా నిత్యం ఆదుకుంటూనే ఉన్నామన్నారు.

కార్యకర్తలను కడుపులో పెట్టి చూసుకుంటానన్నారు ఎవ్వరికి ఏ సమస్య వచ్చినా నేనున్నానని సంగతి మర్చిపోవద్దని, నాకు టికెట్ వచ్చి రెండు నెలలు అయింది, టికెట్ రాగానే ఉప్పల్ నియోజకవర్గంలో కొన్ని చోట్ల ఉన్నటువంటి ఇండస్ట్రియల్ భూములను కేసీఆర్, కేటీఆర్ సహకారంతో రెసిడెన్షియల్ జోన్ లోకి తెచ్చానని గుర్తుచేశారు. మీరు నిమ్స్, గాంధీ హాస్పిటల్ పోయే అవసరం లేకుండా ఉప్పల్లోనే 100 పడకల ఆస్పత్రి మంజూరు చేపించాను. ఎన్నికలు అయిపోయాక ఆ పని మొదలవుతుందని తెలిపారు.

ఎమ్మెల్యే కాకముందే నియోజకవర్గానికి ఇన్ని పనులు చేస్తుంటే, రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు ఎంత పని చేస్తానో మీరే ఆలోచన చేయాలనీ విజ్ఞప్తి చేశారు.  విద్యార్థుల భవిష్యత్తు కోసం  ఉప్పల్లో జూనియర్, డిగ్రీ కళాశాలను, ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నీ ఏర్పాటు చేస్తానని, దళితబందు, బిసీబందు, గృహలక్ష్మి మొదలగు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్ని అర్హులైన వారందరికీ వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 400 రూపాయలకే గ్యాస్ వస్తుందని తెలిపారు.

కేసీఆర్ బీమా – ప్ర‌తి ఇంటికి ధీమా ఇది పాపుల‌ర్ స్కీం.. అన్ని కుటుంబాల‌కు ర‌క్ష‌ణ క‌వ‌చంలా ఉంటుందనీ, మీ పిల్లలకు మెడిసిన్ సీటు వచ్చి, ఫీజ్ కట్టలేని పరిస్థితి ఉంటే  నేనే కడతానని హామీ ఇచ్చారు.  కార్యకర్తలను కడుపులో పెట్టి చూసుకుంటానన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల ఇంచార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి , బిఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి , బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాసరావు , బిఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి , మాజీ కార్పొరేటర్ గొల్లురి అంజయ్య  , కార్పొరేటర్లు, కార్మిక శాఖ నాయకులు,   కార్మిక సంఘాల నేతలు ముఖ్య నాయకులు, ఉద్యమకారులు సీనియర్ నాయకులు  కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

ఫిబ్ర‌వ‌రి 12న ‘ఎఫ్‌సీయూకే’ చిత్రం విడుద‌ల‌

Satyam NEWS

‘జగన్‌ సలహాలను పరిగణలోకి తీసుకోవాలని అమిత్‌ షాను కోరాం’

Satyam NEWS

భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై విజయవాడలో ధర్నా

Satyam NEWS

Leave a Comment