32.2 C
Hyderabad
May 16, 2024 14: 46 PM
నిజామాబాద్

స్కూళ్లు మూసేస్తే చూస్తూ ఊరుకోం

tgvp

కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలపై అనుసరిస్తున్న వైఖరిని మార్చుకోవాలని తెలంగాణ విద్యార్థి  పరిషత్ ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు వెంకటేష్ నాయక్ కోరారు. 5 కిలోమీటర్ల పరిధిలో ఒకే స్కూల్ ఉండాలనే ఆలోచనలో ప్రభుత్వం యోచించటం సరికాదని ఇది పూర్తిగా విద్యాహక్కు చట్టానికి విరుద్ధమని ఆయన అన్నారు. అనేక ప్రాంతాల వారికి ఇప్పుడిప్పుడే సరియైన విద్య అందుతున్నదని,  దానిని కొల్లగొట్టే ప్రయత్నం trs ప్రభుత్వం చేయడం దురదృష్టకరమని వెంకటేష్ నాయక్ అన్నారు.

దీని వలన రాష్ట్రం మొత్తం 12 వేలకు పైగా స్కూల్స్ మూతపడే ప్రమాదం ఉందని, 3 వేలమందికి పైగా ఉద్యోగాలు కోల్పోతారని ఆయన అన్నారు. ఇదే ఆలోచన విధానం తో స్కూళ్లను ముసివేస్తే పెద్దఎత్తున ప్రభుత్వనికి బుద్ధి చెప్పే దిశగా ఉద్యమాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశo లో tgvp నాయకులు ఆధమ్, గంగాధర్, ఆరవింద్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

విధులకు హాజరు కావాలని వెళ్తూ అనంత లోకాలకు

Satyam NEWS

జై తెలంగాణ:తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచి

Satyam NEWS

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత టీవీ చానల్‌ పేరుతో మోసం

Satyam NEWS

Leave a Comment