32.2 C
Hyderabad
May 16, 2024 14: 49 PM
Slider కడప

సిటీ స్కాన్ పేరిట దోచుకుంటున్న డాక్టర్లు,ల్యాబ్స్

#TDPKadapa

డాక్టర్లను కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గౌరవిస్తుంటే కమీషన్ల కోసం కక్కుర్తి పడి సిటీ స్కాన్ పేరిట దోచుకుంటున్నారని కడప జిల్లా టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ మండి పడ్డారు.

గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సిటీ స్కాన్ చేసుకుంటే కోవిడ్ పాజిటివ్ తెలుస్తుందని ప్రయివేట్ ల్యాబ్ లకు అప్పగించారని ఒక్కో సిటీ స్కాన్ టెస్టు కు కొందరు డాక్టర్లు, రూ. 2500 కమిషన్లు దండుకుంటున్నారన్నారు.

డాక్టర్లు ఇప్పటి వరకు ఎంతమందికి సిటీ స్కాన్ చేయించిన వివరాలు తెలపాలన్నారు. రిమ్స్ లో సిటీ స్కాన్  ఎందుకు పని చేయడం లేదో చెప్పలన్నారు. రిమ్స్ లో 130 వెంటిలేటర్స్ ఉన్నా ఉపయోగించడం లేదని ఆయన మండిపడ్డారు. సిటీ స్కాన్ టెస్టుల కోసం కుంభమేళాలో పాల్గొన్నట్టు జనాలు కిక్కిరిసిపోయారని ఆయన అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా కరోనా వైద్యం ఎందుకు అందించడం లేదో చెప్పాలన్నారు. ప్రయివేట్ ఆసుపత్రుల్లో 2 లక్షలు కడితేనే కరోనా కు వైద్యం అందించడం దారుణమన్నారు. ఆక్సిజన్ లేక కరోనా పాజిటివర్స్ ఉరేసుకుంటున్నారన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కర్రీస్ అమ్ముకొని జీవించే వారిపై అధికారులు జులుం ప్రదర్శిస్తున్నారని,కర్రీస్పాయింట్స్,వీడియో లైబ్రరీల కు వృత్తి  పన్నులు విధించి ప్రభుత్వం దోచుకుంటుందని మండి పడ్డారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిటీ స్కాన్ చేయకపోవడం వల్ల ప్రయివేట్ ల్యాబ్ లో 6 వేలు బిల్లు వేస్తున్నారన్నారు. వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందిస్తానని ముఖ్యమంత్రి చెబుతున్నారని అయితే కరోనాను అందులో చేర్చడం లేదని అన్నారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గన్నేపాటి మల్లేష్,బీసీ నాయకుడు యాటగిరి రామప్రసాద్ పాల్గొన్నారు.

Related posts

కోడెల కొట్టేసిన ఫర్నీచర్ జాబితా ఇది

Satyam NEWS

ప్రజా డైరీ సంచిక ప్రధాని మోడీ కి అంకితం

Satyam NEWS

ఊహించని రీతిలో ప్రమాదం: ఇద్దరి మృతి

Satyam NEWS

Leave a Comment