27.7 C
Hyderabad
May 4, 2024 10: 47 AM
Slider మహబూబ్ నగర్

సిబ్బందితో సహా బ్యాంకుకు తాళం వేసిన ఖాతాదారులు

#UnionBank

ఇదేం బ్యాంకో అర్ధం కావడం లేదు అంటున్నారు నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ఖాతాదారులు. చాలా రోజుల నుంచి ఇక్కడ బ్యాంకు ప్రతి రోజూ తెరుస్తున్నారు కానీ ఖాతాదారులకు మాత్రం సేవలు అందివ్వడం లేదు.

ఎప్పుడు ఎవరు వెళ్లి అడిగినా నెట్ వర్క్ సరిగా లేదు అని బ్యాంకు సిబ్బంది సమాధానం చెబుతున్నారు. బ్యాంకు తెరుస్తున్నారు కానీ తమకు ఉపయోగపడటం లేదని అక్కడి ప్రజలు ఎంతో ఆవేదన చెందారు.

సరే…ఎటూ మనకు ఉపయోగపడటం లేదు కదా ఈ బ్యాంకు ఎందుకు అనే ఉద్దేశ్యంతో సిబ్బందిని లోపల ఉంచి బయట తాళాలు వేశారు. బ్యాంకు సిబ్బంది లబోదిబో మంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దాంతో సమాచారం అందుకున్న చారకొండ పోలీస్ లు సంఘటన స్థలానికి చేరుకొని బ్యాంక్ మేనేజర్ కృష్ణతో మాట్లాడారు.

సమస్యను తొందరలోనే పరిష్కరించుకుంటామని బ్యాంకు మేనేజర్ హామీ ఇవ్వడంతో పోలీసులు అదే విషయాన్ని చెప్పి ప్రజలను అక్కడి నుంచి పంపించారు. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగానే ఉంది.

Related posts

చాకలి ఐలమ్మ మహిళా చైతన్యానికి ప్రతీక

Satyam NEWS

అనాధ మృతదేహానికి రాజంపేట డీఎస్పీ అంత్యక్రియలు

Satyam NEWS

మల్టి జోన్ 1లో 16 మంది ఇన్స్పెక్టర్లు బదిలీ

Bhavani

Leave a Comment