కడప జిల్లా రైల్వే కోడూరు మండలం శెట్టిగుంట లక్ష్మి గారి పల్లి వద్ద కొద్ది సేపటి కిందట (సోమవారం రాత్రి) జరిగి రోడ్డు ప్రమాదంలో ఒకరు మరనించారు. కడప తిరుపతి నాన్ స్టాప్ ఆర్టీసీ బస్సు ను స్కూటర్ ఢీకొన్న ఘటనలో స్కూటరిస్టు మరణించాడు.
ఢీకొన్న వెంటనే స్కూటర్ టాంక్ పేలి చెలరేగిన మంటలు బస్ కు మొత్తం వ్యాపించడం తో,అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను దించేయడం వల్ల పెను ప్రమాదం తప్పింది. బస్సు పూర్తి గా దగ్ధం అయ్యింది. బస్ నెంబర్ AP04 Z 0386. చివరకు ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు.
కాలుతున్న బస్సు మంటలను అదుపు చేయడానికి వచ్చిన ఫైర్ సిబ్బంది కి బస్ కు చివరి సీట్ లో పూర్తిగా కాలి ముద్ద అయన మృతదేహాన్ని గుర్తించారు. కనీసం అడ మగ అని కూడా గుర్తించలేని విధంగా ముద్ద అయన మృతదేహాం.