32.2 C
Hyderabad
May 16, 2024 14: 11 PM
Slider ముఖ్యంశాలు

కరోనా హెల్ప్: విద్యుత్ ఉద్యోగుల భారీ విరాళం

#ElectricityEmployees

తెలంగాణ విద్యుత్ సంస్థల ఉద్యోగులు ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ విరాళం అందించారు. తెలంగాణ జెన్ కో, ట్రాన్స్ కో, ఎస్.పి.డి.సి.ఎల్., ఎన్పీడిసిఎల్ కు చెందిన ఉద్యోగులు, పెన్షనర్లు మొత్తం 70వేల మంది తమ ఒక రోజు వేతనం మొత్తం రూ.11.40 కోట్ల రూపాయలను విరాళంగా అందించారు.

దీనికి సంబంధించిన చెక్కును నాలుగు సంస్థలకు చెందిన సిఎండిలు, వివిధ విద్యుత్ ఉద్యోగ సంఘాల నాయకుల సమక్షంలో జెన్ కో – ట్రాన్స్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు బుధవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందించారు.

ఈ కార్యక్రమంలో ఎస్.పి.డి.సి.ఎల్. సిఎండి రఘుమారెడ్డి, ఎన్.పి.డి.సి.ఎల్. సిఎండి గోపాలరావు, ట్రాన్స్ కో జెఎండి శ్రీనివాసరావు, డైరెక్టర్ సూర్యప్రకాశ్, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు శివాజి, రత్నాకర్ రావు, అంజయ్య, బిసి రెడ్డి, సాయిబాబా, ప్రకాశ్, జాన్సన్, రమేశ్, వజీర్, కుమారస్వామి, సాయిలు, గణేష్, సతన్యనారాయణ, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. కరోనా కష్ట కాలంలో విద్యుత్ ఉద్యోగులంతా రేయింబవళ్ళు కష్టపడి 24 గంటల పాటు విద్యుత్ అందిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా అభినందించారు. ఉద్యోగులంతా తమ ఒక రోజు వేతనాన్ని విరాళంగా అందించడం ప్రభుత్వానికి స్పూర్తిగా నిలుస్తుందని సిఎం ప్రకటించారు. విద్యుత్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు.

Related posts

2020కి ప్లాస్టిక్ ర‌హిత న‌గ‌రంగా విజ‌య‌వాడ‌

Satyam NEWS

బాలిక‌ల వ‌స‌తి గృహాల‌ను పున‌ర్విభ‌జ‌న చేయాలి

Satyam NEWS

అగ్రవర్ణాల వేధింపుతోనే సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

Leave a Comment