40.2 C
Hyderabad
May 5, 2024 16: 23 PM
Slider ఖమ్మం

అపర కర్మ భవనoకు శంకుస్థాపన

#brahman

ఖమ్మం నగరంలోని పంచాక్షరి కాలనీ, వెలుగుమట్లలో రూ. 75 లక్షల అంచనాలతో నిర్మించనున్న తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అపర కర్మ భవన నిర్మాణ పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ కెవి. రమణా చారితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బాహ్మణులకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు జరిగేలా ఈ భవనాన్ని బాహ్మణ సదనంగా నామకరణం చేయాలని అన్నారు. నిర్మాణ స్థలం చాలా విలువైనదని, నూతన కలెక్టరేట్ కు దగ్గరలో వున్నదని, స్థల దాత మాదిరాజు సీతారామరావు కు మంత్రి అభినందించారు. తెలంగాణా ప్రభుత్వంఏర్పడ్డాక ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొట్టమొదటి పరిషత్ బాహ్మణ సంక్షేమ పరిషత్ అని, ప్రతి సంవత్సరం బాహ్మణ సంక్షేమ పరిషత్ కు రూ. 100 కోట్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.

అర్చకులకు ట్రెజరీ ద్వారా వేతనం ఇస్తున్న ఒకే ఒక రాష్ట్రం కూడా తెలంగాణ అని మంత్రి తెలిపారు. వివేకానంద విదేశీ విద్యా పథకం క్రింద బ్రాహ్మణ పిల్లలకు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసానికి రూ. 20 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ఆయన అన్నారు. ఇప్పటికి ఈ పథకం క్రింద 637 మంది విద్యార్థులకు రూ. 64 కోట్లు కేటాయించామన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక, వ్యాపార వేత్తలకు ప్రోత్సాహం క్రింద ఇప్పటి వరకు 3647 మందికి రూ. 103 కోట్లు రూ. 5 లక్షల సబ్సిడీతో అందించామన్నారు.

యాదాద్రిని ఒక అద్భుత దేవాలయంగా తీర్చిదిద్దారని, జీర్ణ దశలో ఉన్న ఖమ్మంలోని లక్ష్మీ నరసింహస్వామి స్తంభాద్రి దేవాలయాన్ని అభివృద్ధి పర్చాలన్నారు. పేదవారు ఏ కులంలో ఉన్న పేదవారేనని, అందుకే ప్రభుత్వం కళ్యాణలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం అగ్ర కులాలవారికి వర్తింపజేసిందన్నారు. సంక్షేమం, చదువులో కులం లేదని, అభివృద్ధికి ప్రాంతం లేదని, అన్నిటినీ సమాన దృష్టిలో చూస్తుందని ఆయన తెలిపారు. కాళేశ్వరం లాంటి బృహత్తర ప్రాజెక్టును 3 సంవత్సరాల్లో పూర్తి చేసినట్లు ఆయన అన్నారు. హైదరాబాద్ లో 6 ఎకరాల స్థలంలో ఇంద్ర భవనంలా బాహ్మణ సదనం నిర్మాణం పూర్తయి, ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు.  

కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ డా. కె.వి. రమణా చారి మాట్లాడుతూ, బ్రాహ్మణ పేదవారి సంక్షేమానికి చర్యలు చేపట్టుతున్నట్లు తెలిపారు.  హైదరాబాద్, సూర్యాపేట లలో నిర్మించిన బ్రాహ్మణ సదనాలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఖమ్మంలో నిర్మించనున్న భవన పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. బాహ్మణులు శాఖల జోలికి వెళ్లకుండా ఐక్యమత్యంగా ఉండి, పనులు పూర్తి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లక్ష్మీ ప్రసన్న, సీఎం సీపీఆర్వో, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ వైస్ చైర్మన్ వనం జ్వాలా నర్సింహారావు, ఆర్ ను బి ఇఇ శ్యామ్ ప్రసాద్, ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్,బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

వెనువెంటనే పీఎస్ లను తనిఖీ చేస్తున్న విజయనగరం ఎస్పీ

Satyam NEWS

యాదాద్రి గోపురానికి కిలో బంగారం ఇచ్చిన మంత్రి పువ్వాడ

Satyam NEWS

భారతీయులంతా తప్పకచూడాల్సిన సినిమా దీన్ రాజ్ “భారతీయన్స్”

Satyam NEWS

Leave a Comment