ఒక నిరంకుశ పాలకుడిపై నిరంతరాయంగా ఐదు సంవత్సరాల పాటు పోరాడటం అంటే మాటలు కాదు. మామూలు విషయం కూడా కాదు. మొదటి సంవత్సరం పాటు ఏ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఇంటి నుంచి బయటకు రావడానికి కూడా భయపడ్డారు. అయితే నిత్యం ప్రజల పక్షాన ఉండాలనే తపనతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మాత్రం కార్యక్షేత్రాన్ని వదల్లేదు.
ఆయనతో బాటు కదిలిన పార్టీ యంత్రాంగం మెల్లిమెల్లిగ వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటూ రాష్ట్రం కోసం పోరాడాల్సిందేనని నిర్ణయానికి వచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తనదైన శైలిలో పార్టీ యంత్రాంగాన్ని ముందుకు తీసుకెళ్లారు. తెలుగుదేశం పార్టీకి స్పందన రావడం లేదని చాలా కాలం సంతోషంగా ఉన్న జగన్ రెడ్డి తన ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తించారు.
తెలుగుదేశం పార్టీ నాయకులతో మొదలు పెట్టిన అరాచకాలు బీసీలు, ఎస్ సెలు, ఎస్ టీలు ముస్లింలు ఇలా ఒక్కరికి కాదు అందరికి పంచి పెట్టారు. అందరిని వేధింపులకు గురి చేశారు. ఫ్యాక్షనిజం పెరిగిపోయింది. దౌర్జన్యం నిత్యకృత్యమైంది. ప్రాణాలకు తెలించి పోరాడిని తెలుగుదేశం పార్టీ వారితో జన సైనికులు జత కట్టారు. ఇప్పుడు బీజేపీ కూడా రంగంలోకి వచ్చింది.
ఇంత పోరాటం చేసిన వారికి అందరికి న్యాయం చేయడం అంటే పదవులు ఇవ్వడం అనేది టాప్ ప్రయారిటీగా నారా లోకేష్ చెబుతూనే ఉన్నారు. అదే విధంగా పార్టీ కి నిస్వార్థంగా, లేదా పదవుల కోసం అవకాశాల కోసం, గట్టిగా పని చేసిన అందరికీ ఒకేసారి ఎమ్మెల్యే గా పోటీ చేసే అవకాశం కల్పించడానికి మంత్రదండం ఉండదు. రాజకీయ పార్టీలు ఒక్కో రొటేషన్ లో కొందరికి అవకాశం ఇస్తూ ముందుకు వెళ్తుంటారు.
టికెట్ రాని వాళ్ళకి సమీప భవిష్యత్ లో కాబినెట్ హోదా రాష్ట్ర పదవులు, కార్పొరేషన్ చైర్మన్లు లాంటి పదవులు వస్తాయి. అయితే సోషల్ మీడియాలో రాజకీయ అవగాహన లేని, పరిపక్వత లేని కొందరు వ్యక్తులు చేసే పోస్టులు అర్థ రహితంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రం మొత్తం కలిపి ఒక మూడు నాలుగు పేర్లు రాసి వీళ్ళకి అవకాశం ఇవ్వలేదు కాబట్టి తమ అధినేత “పార్టీని నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయలేదు ” అని అసమ్మతి వ్యక్తం చేయడం, ఆరోపణ చేయడం ఫూలిష్ నెస్.
ఈ అపరిపక్వ పద్ధతి జనసైనికుల్లో ఎక్కువ, టిడిపిలో కొంత వరకు కనిపిస్తూ ఉంటుంది. వైసిపి సోషల్ మీడియా వారు మాత్రం తమ అధినేత నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. అంత పెద్ద తెలుగుదేశం పార్టీ కేవలం టికెట్ వచ్చిన 145 మందితో నిర్మాణం అవ్వలేదు! కనీసం అదే స్థాయి ఉన్న ఇంకొన్ని వేల మంది సమయం, డబ్బు, సేవ పెడితే నడుస్తోంది ఆ పార్టీ.
అంటే .. సీట్లు వచ్చిన 145 కాకుండా ఇంకా వందలాది మందికి అవకాశం కల్పించలేదు అన్నట్టే ! తెదేపా తో పోల్చుకుంటే జనసేన స్థాయికి అవకాశం రాని వాళ్ళ సంఖ్య చాలా చాలా తక్కువ. కానీ ఎక్కడా లేని అల్లరి జనసెన లో కొందరి సొంతం ! ఆ ప్రాసెస్ లో మీరు అధినేత సక్రమంగా పనచేయడానికి లేకుండా.. అనవసరపు ఒత్తిడి, పరువు తియ్యడం చేస్తున్నారు అని గమనించండి.
జనసేన పోతిన మహేష్ లు, సందీప్ పంచకర్ల లు మంచి పని చేశారు పార్టీ కి.. అయితే వారు టిడిపి దేవినేని ఉమ, నల్లమిల్లి శేషరెడ్డి, కల్వపుడి శివ కన్నా పెద్ద నాయకులు ఏమి కాదు…. వాళ్ళు అనే నిజాన్ని గమనించాలి. ఉమ , శేష, శివ లాంటి వందల మంది టిడిపి వారికి కూడా అవకాశం రాలేదు. జనసేన లో అతి కొద్ది మందికి మాత్రమే అవకాశం రాలేదు.
90% జన సైనికుల కి ఈ విషయం అర్థం అయ్యి అలయెన్స్ కి పూర్తి మద్దతుగా ఉన్నారు. మిగిలిన వాళ్ళు కూడా మారాలి. మహిళలను బూతులు తిట్టడం, డబ్బుకి పని చేయడం లాంటి అవలక్షణాలు ఉన్న వైసీపీలోనే పార్టీ లైన్ కు కట్టుబడి పని చేసేవాళ్లు ఉంటే ఇక క్యాడర్ బేస్ డ్ పార్టీలైన జనసేన, తెలుగుదేశం పార్టీలో డిసిప్లిన్ ఏ స్థాయిలో ఉండాలి?
పొత్తు ధర్మం గురించి అందరికి తెలుసు కానీ బిజెపిఇచ్చిన సీట్ల పైన మాత్రం కొందరు విమర్శలు చేస్తున్నారు. ఇక బిజెపి ఆంధ్ర వింగ్ .. వీరికి ఉన్న 1% ఓటు శాతంకి, సోషల్ మీడియా లో వేసే వేషాలకి సంబంధం ఉండదు. అందులో సగం మంది పూజలు మోడీ కీ, ఫలహారాలు జగన్ కి అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఇవి అన్నీ గమనించి ఆయా పార్టీ ల సోషల్ మీడియా వాళ్ళు రాష్ట్రం అజెండా గా పని చెయ్యాలి. అప్పుడే రాష్ట్రానికి నిజమైన స్వాతంత్ర్యం వస్తుంది.