33.7 C
Hyderabad
April 30, 2024 01: 52 AM
Slider జాతీయం

రూ.4,650 కోట్లు అక్రమ తరలింపు అడ్డుకున్న ఈసీఐ

#rajeevkumar

దేశంలో 75 ఏళ్ల లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2024 సార్వత్రిక ఎన్నికల సందర్బంగా  అత్యధిక మొత్తంలో రూ.4,650 కోట్ల సొత్తును స్వాధీనం చేసుకొని ఈసీఐ రికార్డు నెలకొల్పింది. 18వ లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ శుక్రవారం ప్రారంభం కావడానికి ముందే డబ్బు శక్తిపై ECI యొక్క దృఢమైన పోరాటంలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు రికార్డు స్థాయిలో రూ.4650 కోట్లకు  పైగా స్వాధీనం చేసుకున్నాయి.

2019 లో జరిగిన మొత్తం లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో స్వాదీనం చేసుకున్న మొత్తం రూ. 3,475 కోట్లకు పైగా ఈ ఎన్నికల మొదటి దశలోనే  జప్తు చేయడం గమనార్హం. డ్రగ్స్ మరియు మాదక ద్రవ్యాల పై  కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది అనడానికి స్వాదీనం చేసుకున్న మొత్తం  సొత్తులో 45% డ్రగ్స్ మరియు మాదక ద్రవ్యాలు ఉండటమే నిదర్శనం. సమగ్ర ప్రణాళిక, సహకారం, ఏజెన్సీల ఏకీకృత నిరోధక చర్యలు, చురుకైన పౌరుల భాగస్వామ్యం మరియు సాంకేతికత సహకారమే ఇంత పెద్ద మొత్తంలో సొత్తును స్వాదీనం చేసుకోవడం సాధ్యమైంది.

నల్లధనాన్ని ఉపయోగించడం, పైగా రాజకీయ ఫైనాన్సింగ్ మరియు దాని ఖచ్చితమైన బహిర్గతం, నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాలలో మరింత వనరులతో కూడిన పార్టీ లేదా అభ్యర్థికి అనుకూలంగా ఉండే స్థాయికి ఆటంకం కలిగించవచ్చు.  ECI సంకల్పించినట్లుగా లోక్‌సభ ఎన్నికలను ప్రేరేపణలు మరియు ఎన్నికల అవకతవకలకు తావు లేకుండా నిర్వహించేందుకు జప్తులు/స్వాదీనం చేయడం అనేవి కీలకమైన భాగం. గత నెలలో ఎన్నికల షెడ్యూలును ప్రకటిస్తూ CEC రాజీవ్ కుమార్ మనీ పవర్‌ను ‘4M’ సవాళ్లలో ఒకటిగా నొక్కిచెప్పారు.

ఏప్రిల్ 12న CEC రాజీవ్ కుమార్ నేతృత్వంలో EC లు జ్ఞానేష్ కుమార్ మరియు సుఖ్‌బీర్ సింగ్ సంధుతో కలిసి ఏప్రిల్ 19న జరుగనున్న ఎన్నికలు పర్యవేక్షించేందుకు ఫేజ్-1లో నియమించబడిన కేంద్ర పరిశీలకులందరితో సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ చర్చల్లో భాగంగా ప్రేరేపణ-రహిత ఎన్నికల ప్రక్రియను నిర్ధారించడానికి పర్యవేక్షణ మరియు తనిఖీలపై ప్రత్యేక దృష్టి ఉంటుందన్నారు.

ముఖ్యంగా చిన్న మరియు తక్కువ వనరులు కలిగిన పార్టీలకు ఎన్నికలు అనుకూలంగా ఉండే విదంగా ఎన్నికల్లో ప్రేరణలను పర్యవేక్షించడానికి మరియు ఎన్నికల అక్రమాలను అరికట్టడానికి జప్తులు / స్వాదీనాల్లో పెరుదల అనేది ECI తిరుగులేని నిబద్ధతను ప్రతిబింబిస్తున్నాయి.

తమిళనాడులోని నీలగిరిలో విధి నిర్వహణలో అలసత్వం మరియు ఓ ప్రముఖ నాయకుడిని లక్ష్యంగా చేసుకుని ఆయన కాన్వాయ్ పై దాడులు నిర్వహించిన ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాన్ని ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది. అదేవిధంగా ఒక రాష్ట్రానికి చెందిన సీఎం కాన్వాయ్‌లోని వాహనాలను, మరో రాష్ట్రంలోని  డిప్యుటీ సీఎం వాహనాన్ని కూడా అధికారులు తనిఖీ చేశారు. ప్రచారంలో రాజకీయ నాయకులతో కుమ్ముక్కై, ప్రవర్తనా నియమావళిని మరియు కమిషన్ సూచనలను ఉల్లంఘించిన సుమారు 106 మంది ప్రభుత్వ ఉద్యోగులపై కూడా కమిషన్ కఠిన చర్యలు తీసుకుంది.

పార్లమెంటరీ ఎన్నికల ప్రకటన సందర్భంగా విలేకరుల సమావేశంలో సీఈసీ రాజీవ్ కుమార్ తన ప్రెజెంటేషన్‌లో నాన్ షెడ్యూల్డ్ విమానాలు మరియు హెలికాప్టర్‌ల విషయంలో బీసీఏఎస్ సూచనలను ఖచ్చితంగా పాటించాలని ఆదాయపు పన్ను, విమానాశ్రయ అధికారులు మరియు సంబంధిత జిల్లాల అధికారులు, సరిహద్దు ఏజెన్సీలకు స్పష్టం చేశారు. అంతర్జాతీయ చెక్‌పోస్టులు మరియు గోడౌన్ లను GST అధికారులు నిశితంగా పర్యవేక్షించాలని, ముఖ్యంగా ఉచితాలను నిల్వ చేయడానికి ఉద్దేశించిన తాత్కాలిక గోడౌన్‌లను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. అన్ని రవాణా మార్గాలపైనా బహుముఖ నిఘా ఉంటుందని కమిషన్ సమీక్షల సందర్భంగా ఎప్పుడూ చెబుతూ వస్తోంది. రోడ్డు మార్గాల్లో చెక్‌పోస్టులు, నకాస్‌ లు,  కోస్టల్‌ రూట్లలో కోస్ట్‌గార్డు, హెలికాప్టర్లు, షెడ్యూల్ లో లేని విమానాలను తనిఖీ చేసేందుకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో పాటు సంబంధిత శాఖల అధికారులను రంగంలోకి దించడం జరిగింది.

Related posts

రాష్ట్రంలో 5 పామాయిల్ పరిశ్రమల స్థాపనపై మంత్రి తుమ్మల తొలి సంతకం

Satyam NEWS

నరసాపురం టీడీపీ తెలుగు రైతు అధ్యక్షుల నియామకం

Satyam NEWS

హెచ్.సి.యు యూనివర్సిటీ లీజును  పొడిగించాలి

Satyam NEWS

Leave a Comment