27.7 C
Hyderabad
May 4, 2024 09: 02 AM
Slider గుంటూరు

డాక్టర్ చదలవాడకు ఆర్యవైశ్యుల మద్దతు

#aryavysya

పల్నాడు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి డాక్టర్ చదలవాడ అరవిందబాబుకు ఆర్యవైశ్యులు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. అరవిందబాబుని గెలిపించుకుంటామని ఆర్యవైశ్యులంతా ముక్త కంఠంతో నినదించారు. ఎన్నికల ప్రచారంలో డా౹౹చదలవాడ అరవింద బాబుకి ఆర్యవైశ్యులు మద్దతు తెలిపారు. నరసరావుపేట పట్టణంలోని వినాయక,వాసవి టవర్స్,గుప్తా ప్యాలెస్ అపార్ట్ మెంట్‌లో డా౹౹చదలవాడ అరవింద బాబు నేడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఆయన ఘనంగా స్వాగతం పలికిన ఆర్యవైశ్యులు తోడుగా నిలుస్తాం, గెలిపించుకుంటామని భరోసా ఇచ్చారు. తమలో ఒకరిగా, తోడుగా నిలిచిన డా౹౹చదలవాడ అరవింద బాబుకు అండగా నిలుస్తామంటూ వారు వెల్లడించారు. ఆర్యవైశ్యుల్ని వేధించి, వ్యాపారాలు చేసుకోనీయకుండా అవస్థలు పెట్టిన వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డికి గుణపాఠం చెబుతాం అని వారు అన్నారు. దశాబ్దాలుగా వ్యాపారాలు చేస్తున్నా.. ఎన్నడూ లేని గడ్డు పరిస్థితులు గత ఐదేళ్లుగా ఎదుర్కొంటున్నాం. జే-ట్యాక్, గోపిరెడ్డి ట్యాక్స్ బాదుడుకు వ్యాపారాలు కుదేలైపోయాయి. బాదుడు లేని,బాసటగా నిలిచే కూటమిని అధికారంలోకి తెచ్చుకుంటామని వారు స్పష్టం చేశారు.

Related posts

స్కాలర్ షిప్ అక్రమాలపై ఎఫ్ ఐ ఆర్ నమోదు

Satyam NEWS

ఆర్యన్‌ఖాన్‌ చుట్టూ ఉచ్చు.. మూడ్రోజుల కస్టడీ.. మరో ఇద్దరి అరెస్ట్..

Sub Editor

వర్ష బాధితులకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సాయం

Satyam NEWS

Leave a Comment