38.2 C
Hyderabad
April 27, 2024 15: 16 PM
Slider ప్రపంచం

తప్పుడు మ్యాప్ తో మళ్లీ రెచ్చగొడుతున్న చైనా

#false map

భారత్ ను రెచ్చగొట్టే చర్యలకు చైనా మరో సారి పాల్పడింది. 2023 సంవత్సరానికి సంబంధించిన తన ప్రామాణిక దేశపటాన్ని సోమవారం అధికారికంగా విడుదల చేసింది. భారత్‌లో భూభాగమైన అరుణాచల్ ప్రదేశ్, వివాదాస్పద అక్సయ్ చిన్ ప్రాంతాలను తన భూభాగంలో భాగంగా చైనా ఈ పటంలో చూపించింది.

జి20 సమ్మిట్‌కు 42 మంది ఇతర దేశాధినేతలతో పాటు చైనా అధ్యక్షుడిని కూడా ఆహ్వానించి భారత్ తన పెద్దమనసు చాటుకుంటే ఆ సమావేశానికి పది రోజుల ముందు చైనా ఇటువంటి వివాదాస్పద మ్యాప్ ను విడుదల చేయడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. దక్షిణ టిబెట్‌గా అరుణాచల్ ప్రదేశ్‌ను చూపించిన చైనా 1962 యుద్ధ కాలంలో ఆక్రమించిన అక్సయ్ చిన్ ప్రాంతాన్ని తన భూభాగంగా చూపించింది. కొత్త పటంలో తైవాన్‌తో పాటు వివాదాస్పద దక్షిణ చైనా సముద్రాన్ని కూడా తన భూభాగంలో చైనా చేర్చుకుంది.

“చైనా ప్రామాణిక మ్యాప్ 2023 ఎడిషన్ సోమవారం అధికారికంగా విడుదల చేసాము. సహజ వనరుల మంత్రిత్వ శాఖ హోస్ట్ చేసిన ప్రామాణిక మ్యాప్ సర్వీస్ వెబ్‌సైట్‌లో ప్రారంభించాము” అని పోస్ట్ లో పేర్కొన్నారు. “ఈ మ్యాప్ చైనా, ప్రపంచంలోని వివిధ దేశాల జాతీయ సరిహద్దుల డ్రాయింగ్ పద్ధతి ఆధారంగా సంకలనం చేయబడింది” అని తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో చైనా ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రాంతాల పేర్లను “ప్రామాణిక” చేస్తామని చెప్పింది.

ఆ సమయంలో, అది సిసిపి ప్రభుత్వం జాంగ్నాన్‌గా సూచించే దక్షిణ టిబెటన్ ప్రాంతంలోని అరుణాచల్ భాగాలను చూపించింది. అంతేకాకుండా, చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌కు దగ్గరగా ఉన్న పట్టణాన్ని చేర్చింది. అయితే, భారతదేశం, అనేక సందర్భాల్లో, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం “ఎల్లప్పుడూ” దేశంలో అంతర్భాగంగా ఉంటుందని స్పష్టం చేస్తున్నది.

అంతర్యుద్ధం తర్వాత 1949లో తైవాన్ చైనాతో విడిపోయింది. అయితే, అధికార కమ్యూనిస్ట్ పార్టీ అవసరమైతే బలవంతంగా ద్వీపం తిరిగి ప్రధాన భూభాగంలో చేరవలసి ఉంటుందని స్పష్టం చేసింది. తైవాన్ ప్రభుత్వం విదేశీ ప్రభుతాలతో సన్నిహితంగా ఉండటం పట్ల చైనా అసహనం వ్యక్తం చేస్తున్నది. ఆ విధంగా ఉండటంతో వారిలో స్వతంత్ర కాంక్షను రేకెక్తిస్తుంటామని, ఇది యుద్ధానికి దారితీస్తుందని చైనా హెచ్చరిస్తున్నది.

దక్షిణ చైనా సముద్రంలోని అత్యధిక భాగాన్ని తన సరిహద్దుల్లో చైనా కలిపేసుకుంది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతాలు తమవేనంటూ వియత్నాం, ఫిలిప్పీన్స్, మలేషియా, బ్రూనై ఎప్పటి నుంచో వాదిస్తున్నాయి. జెజియాంగ్ ప్రావిన్సులోని డెకింగ్ కౌంటీలో సోమవారం సర్వేయింగ్ అండ్ మ్యాపింగ్ పబ్లిసిటీ డే, నేషనల్ మ్యాపింగ్ అవేర్‌నెట్ పబ్లిసిటీ వీక్ వేడుకల సందర్భంగా చైనా సహజ వనరుల మంత్రిత్వ శాఖ తాజా దేశ పటాన్ని విడుదల చేసింది.

ఈ వివాదాస్పద పటాన్ని చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ వెబ్ సిట్, సోషల్ మీడియా వేదికలపై ఉంచింది. దక్షిణాఫ్రికాలో గత వారం జరిగిన బ్రిక్స్ సదస్సులో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కావడం గమనార్హం. 2020లో సరిహద్దుల్లో రెండు దేశాల సేనల మధ్య ఘర్షణలు జరిగిన తర్వాత రెండు దేశాధినేతలు ఇప్పటివరకు ముఖాముఖి సమావేశం కాలేదు.

Related posts

పవర్ ఫుల్ రేణు దేశాయ్ ‘ఆద్య’ ఆరంభం

Satyam NEWS

తెలంగాణ నుండి యూరప్ కు వేరుశనగ ఎగుమతులు

Satyam NEWS

నేపాల్లో జరిగిన కరాటే అండర్ 14 విభాగంలో సత్తా చాటిన సలోమి

Satyam NEWS

Leave a Comment