ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ధరలను భారీగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం మీద అదనపు పన్ను విధించడంతో ధరల పెంపు అనివార్యమైనట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఏయే మద్యం ధరలు ఎంత మేరకు పెరగనున్నాయో ఉత్తర్వుల్లో వెల్లడించారు.
వివరాలిలా ఉన్నాయి. భారత్‌లో తయారైన విదేశీ మద్యం ధరలు 60 ఎంఎల్, 90 ఎంఎల్ మీద రూ. 30 చొప్పున పెరగనున్నాయి. భారత్‌లో తయారైన విదేశీ మద్యం 180 ఎంఎల్ మీద రూ. 60, భారత్‌లో తయారైన విదేశీ మద్యం 375 ఎంఎల్ మీద రూ. 120, భారత్‌లో తయారైన విదేశీ మద్యం 750 ఎంఎల్ మీద రూ. 240, భారత్‌లో తయారైన విదేశీ మద్యం 1000 ఎంఎల్ మీద రూ. 300, భారత్‌లో తయారైన విదేశీ మద్యం 2000 ఎంఎల్ మీద రూ. 750 చొప్పున పెరగనున్నాయి.
ఇక విదేశీ మద్యం 50-60 ఎంఎల్ మీద రూ. 30, విదేశీ మద్యం 200-275 ఎంఎల్ మీద రూ. 60, విదేశీ మద్యం 200-275 ఎంఎల్ మీద రూ. 60, విదేశీ మద్యం 200-275 ఎంఎల్ మీద రూ. 60, విదేశీ మద్యం 330-500 ఎంఎల్ మీద రూ. 120, విదేశీ మద్యం 700 – 750 ఎంఎల్ మీద రూ. 240, విదేశీ మద్యం 1500/2000 ఎంఎల్ మీద రూ. 750 చొప్పున పెరగనున్నాయి.
ఇక బీర్ 330 ఎంఎల్ మీద రూ. 30, బీర్ 500 ఎంఎల్ మీద రూ. 30, బీర్ 650 ఎంఎల్ మీద రూ. 60, బీర్ 30,000 ఎంఎల్ మీద రూ. 3,000, బీర్ 50,000 ఎంఎల్ మీద రూ. 6,000, బీర్ 50,000 ఎంఎల్ మీద రూ.6,000, బీర్ 50,000 ఎంఎల్ మీద రూ. 6,000 చొప్పున పెరగనున్నాయి. ఇక ‘రెడీ టు డ్రింక్’ బ్రాండ్లు అన్నింటి మీద రూ. 60 ట్యాక్స్ చొప్పున పెరగనున్నాయి. పెరిగిన ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నాయి.