ఎస్ వి బి సి చైర్మన్ గా రాజీనామా చేసిన సినీనటుడు పృథ్వి అందరికి శాపనార్థాలు పెట్టారు. తనపై కుట్ర పన్నిన వారు నాశనం అయిపోతారని ఆయన అన్నారు. తన రాజీనామా వ్యవహారాన్ని చెప్పేందుకు ఆయన హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయన పలు విషయాలను ఏకరవు పెట్టారు. సంక్రాంతి రోజు తమ కుటుంబం అంతా కన్నీళ్ల పర్యంతం అయ్యారని పృథ్వి వాపోయాడు.
స్వామి మీద ఒట్టు వేసి చెబుతున్నా…నా మీద ఆరోపణలు చేసిన వారు భ్రష్ఠు పట్టిపోతారని కూడా అన్నారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు చేస్తున్నారు. నేను ఏ తప్పు చేయలేదు. అందరి దేవుళ్ళ మీద ఒట్టు వేసి చెబుతున్నా అని పృథ్వి అన్నాడు. విజయవాడకు చెందిన ఒక జర్నలిస్ట్ నన్ను వ్యక్తిగతంగా ఇబ్బంది పెడుతున్నారు. ఆయనకు అమరావతిలో 9 ఎకరాల భూమి ఉంది అని పృథ్వి అన్నాడు. తాను ఏ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయలేదని, ఒరిజినల్ రైతులకు క్షమాపణ చెబుతున్నాని పృథ్వి అన్నాడు.