పెద్దపల్లి నుండి కాటారం, రామగుండం నుండి మంథని రోడ్లకు రూ123కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ కు, మంజూరుకు కృషి చేసిన పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్టమధుకర్, భూపాలపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ జక్కుశ్రీహర్షిణి రాకేష్ ల ఫోటోలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని తాడిచెర్ల గ్రామంలో టిఆర్ఎస్ మండలధ్యక్షుడు వెన్నపురెడ్డిసుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో అభివృద్ధి ఏనాడు పటించుకోలేదని ఆరోపించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇసుక రవాణా కారణంగా దెబ్బతిన్న రహదారులను పునరుద్ధరించేందుకు మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్టమధుకర్ గత నెలలో ముఖ్యమంత్రి కెసిఆర్ కు నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం అందించారని అన్నారు.
ఈ మేరకు సిఎం కెసిఆర్ నిధులు మంజూరు చేసినందుకు మండల టిఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు జాగరిహరీష్, టిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి బండిరాజయ్య, సర్పంచ్ లు సుంకరిసత్యం, అడ్డురికుమారస్వామి, పులిగంటి మమత నర్సయ్య, ఇనుకంటె విజయ నాగేశ్వర్ రావు, పవుడల ధనలక్ష్మి నారాయణ, తాజోద్దీన్, బద్రపుసమ్మయ్య, వాల యాదగిరిరావు, తాండ్రమల్లేష్, శీలంలక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.