బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన వారికి కొల్లాపూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ బి.వెంకట్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. రాత్రి వేళల్లో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించి వాహనం నడిపే వారిపై కొల్లాపూర్ సర్కిల్ పరిధిలోని పోలీస్ లు ప్రత్యేక నిఘా ఉంచారు. రాత్రి వేళల్లో కొల్లాపూర్ ఎసై కొంపల్లి మురళి గౌడ్ పోలీస్ బృందంతో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ముఖ్యంగా దిశ సంఘటన జరిగిన నాటి నుండి పోలీసులు అప్రమత్తమయ్యారు. రాత్రివేళలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇదే సందర్భంలో కొన్ని బహిరంగ ప్రదేశాలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి తాగి వాహనం నడుపుతుండగా ఆరుగురిని ఎసై కొంపల్లి మురళి గౌడ్ పట్టుకున్నారు. గురువారం సిఐ వెంకట్ రెడ్డి ముందు హాజరు పరిచారు. ఆరుగురికి సి ఐ వెంకట్ రెడ్డి తన ఛాంబర్ లో కౌన్సెలింగ్ నిర్వహించారు.
ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ క్రమం తప్పకుండా నిర్వహిస్తామని వారు తెలిపారు. ఎవరైనా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు ఉంటాయని సీఐ వెంకట రెడ్డి హెచ్చరించారు. ఇకపై ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎసై మురళి గౌడ్ వారి వివరాలను సేకరిస్తున్నారు.