32.2 C
Hyderabad
May 16, 2024 13: 56 PM
Slider విజయనగరం

జిల్లా న్యాయ సేవాసదన్ లో బాలల సంరక్షణ పై శిక్షణ…!

#nyayasevasadan

ప్రతీ పోలీసు స్టేషన్ నుంచీ ఏఎస్ఐ ర్యాంక్ అధికారి హాజరు….!

ఇక నుంచీ ప్రతీ పోలీస్ స్టేషన్ లో సీ.వీ.పో.ఓ(చైల్డ్ వెల్ఫేర్ పోలీసు ఆఫీసర్) ఉంచాలని….బాల కార్మికుల చట్టంలో పొందుపరచబడిందని…ఆ శాఖ అధికారి అన్నారు. ఈ మేరకు విజయనగరం లోని జిల్లా న్యాయ సేవాసదన్ ఆధ్వర్యంలో చైల్డ్ వెల్ఫేర్ కు సంబంధించి…. న్యాయ శాఖ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది కి శిక్షణ కార్యక్రమం జరిగింది.

ఈ శిక్షణ జిల్లా న్యాయ సేవాసదన్ అధికారులు… అలాగే చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ… బాలలపై పని చేయించుకోవడం…వాళ్ళ ను బలవంతంగా ఫనిలోకి పెట్టుకోవడం వంటి విషయాల పట్ల… ప్రతీ పోలీసు స్టేషన్ నుంచీ ఏఎస్ఐ ర్యాంక్ పోలీసు ఉండాలన్నారు.

కాగా 2012 లో నిర్భయ చట్టం ద్వారా… మరింత గా పోలీసులకు హక్కులు వచ్చాయని సభికులు ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో… డీసీఆర్బీ ఎస్ఐ వాసుదేవ్, దిశ ఎస్ఐ పద్మావతి, వన్ టౌన్ ఎస్ఐ అశోక్, టూటౌన్ ఎస్ఐ అలాగే విజయనగరం రూరల్ ఎస్ఐ, కొమరాడ ,బాడంగి, రాజాం, పూసపాటిరేగ, డెంకాడ ,వల్లంపూడి స్టేషన్ ల నుంచే పోలీసు సిబ్బంది హాజరయ్యారు.

Related posts

భూ కబ్జాకు ప్రయత్నం చేసిన వ్యక్తి అరెస్ట్

Satyam NEWS

ఆర్ధిక అక్షరాస్యత పై చైతన్యం

Bhavani

ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో కూరగాయలు రోడ్డుపై పోసి నిరసన

Satyam NEWS

Leave a Comment