38.2 C
Hyderabad
May 5, 2024 22: 06 PM
Slider వరంగల్

భూ కబ్జాకు ప్రయత్నం చేసిన వ్యక్తి అరెస్ట్

భూ కబ్జాదారులపై ఓరుగల్లు పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. అక్రమార్కుల ఆట కట్టిస్తూ, అభాగ్యులకు అండదండగా నిలుస్తున్నారు. పూర్వీకుల నుండి సంక్రమించిన ఆస్తులకు కూడ నకిలీ పత్రాలు సృష్టిస్తూ కబ్జా చేయడానికి భూ బకాసురులు తెగబడుతున్నారు. భూ మాఫియా ఆగడాలకు వరంగల్ పోలీసులు చెక్ పెడుతూ, కటకటాల వెనిక్కి నెడుతున్నారు.

అతడో దివ్యాంగుడు.పైగా 40 ఏళ్లుగా అదే స్థలంలో, అదే చోట గల ఇంట్లో నివస్తున్నాడు.పైగా ఆ స్థలం ఆ దివ్యాంగుడికి తన, పూర్వీకుల నుండి సంకేయమించిన ఆస్థి. అటువంటి ల్యాండ్ పై లోకల్ గా ఉండే భూ బకాసురుడు కన్నుపడింది.ఏ విధంగా నైనా కబ్జా చేసుకోవాలనుకున్నాడు. అందుకు పకడ్బందీ పథకంతో నకిలీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు సృష్టించాడు. ఇక 250 గజాల స్థలం దక్కించుకోవడానికై కోర్టులో కేసు వేసి,వారికి చుక్కలు చూపించాడు.

సదరు దివ్యాంగుని కుటుంబం కుటుంబంలో కోర్టులో తగిన సాక్ష్యాధారాలు చూపి, తమ సొంత స్థలమనే కాక,పూర్వీకుల నుండి వస్తున్న స్థలంగా నిరూపించుకున్నారు. అయిన సదరు భూ కబ్జాదారుడు తప్పుడు పద్ధతుల ద్వారా,బెదిరింపుల ద్వారా భూ యజమానులను భయపెట్టి భూములని కబ్జాచేయలని చూస్తుండటంపై, న్యాయం చేయమని అభ్యర్థిస్తూ బాధిత కుటుంబం ఇంతేజార్ గంజ్ పోలీసులను ఆశ్రయించారు. ఇంతేజార్ గంజ్ ఇన్ పెక్టర్ దగ్గు మల్లేష్ పూర్తి విచారణ చేసి, కాశిబుగ్గ కు చెందిన భాధితుడైన సయ్యద్ అసద్ (దివ్యాంగుడు) అండదండగా నిలిచారు. కాశిబుగ్గ లోని వాళ్ళ పూర్వీకుల నుండి దాదాపు 40 ఏళ్లుగా సయ్యద్ అసద్ ఉంటున్న ఇంటిని,ఖాళీ స్థలాన్ని అదే ప్రాంతానికి చెందిన నిందితుడైన రామ.యాదగిరి (51) అను వ్యక్తి కబ్జా చేయాలనే ఉద్దేశ్యంతో సదరు భూమికి సంబంధం లేని వారి నుండి ఒక తప్పుడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్
(సెల్ కమ్ జనరల్ పౌర పటాని) చేయించుకున్నట్టు ఇంతేజార్ గంజ్ పోలీసుల విచారణలో తేలింది.

ఇల్లు, 250 గజాల ఖాళీ స్థలం తనదేనని,వారిని ఖాళీ చేయాలని ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు నిర్ధారణకు వచ్చారు. కోర్టు లో కేసు వేసి చాలా ఇబ్బందులకు గురి చేశారు. కోర్టులో సరైనా ఆధారాలను బాధిత కుటుంబం నిరూపించుకోవడంతో కేసు కొట్టుడుపాయింది.అయిన కూడా కేసు ఒడి పోయిన భూ కబ్జాదారుడు తనతో సెటిల్ మెంట్ కు రావాలని బెదిరింపులకు పాల్పడుతున్నాడు.దీనిపై బాదితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు,ఇంతేజార్ గంజ్ పోలీసులు వారు పూర్తి విచారణ చేపట్టి, తప్పుడు డాక్యుమెంట్ ద్వారా కబ్జా చేయాలని చూసిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన్నట్లు ఇంతేజార్ గంజ్ సిఐ దగ్గు మల్లేష్ తెలిపారు.

తప్పుడు పద్ధతుల ద్వారా,బెదిరింపుల ద్వారా భూ యజమానులను భయపెట్టి భూములని కబ్జాచేయలని చూస్తే కఠిన చర్యలు తప్పవని ఇంతేజార్ గంజ్ ఇన్స్ పెక్టర్ దగ్గు మల్లేశ్ హెచ్చరించారు.మోసాల ద్వారా భూములను కబ్జా చేయాలనే ప్రయత్నాలు మానుకోకపోతే, చట్ట ప్రకారం కేసులు తప్పవని హెచ్చరించారు.

Related posts

సిజెఐ ని కలిసిన గోరేటి

Sub Editor 2

బీసీసీఐ కు షాకిచ్చిన ఆఫ్గాన్ తాలిబాన్లు

Sub Editor

ప్రజల కోసమే చంద్రబాబు పోరాటం: నారా భువనేశ్వరి

Satyam NEWS

Leave a Comment