Slider పశ్చిమగోదావరి

ఏలూరు లో తపాలా అవగాహన వారోత్సవాలు

తపాలా శాఖ విజిలెన్స్ అవగాహనా వారోత్సవాల ను పురస్కరించుకుని క్విజ్ లు సెమినార్ లు వర్క్ షాప్ లు.డిబేట్ లు నిర్వహిస్తున్నట్టు ఏలూరు జిల్లా పోస్టల్ శాఖ ప్రధానాధికారి జి గంగాధర్ ఆదివారం ఓ ప్రకటన ద్వారా తెలియజేసారు. ట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆదేశాల మేరకు అవినీతి రహిత దేశం గా నేడు అభివృద్ధి చెందుతున్న భారత దేశంగా ప్రపంచ దేశాలకు రోల్ మోడల్ గా నిలిచిందని గంగాధర్ తెలిపారు. దేశం లో అవినీతి రహిత సేవలందించే శాఖలలో తపాలా శాఖ కూ డా ఒకటని ఆయన ఈసందర్భంగా గుర్తు చేశారు. విజిలెన్స్ అవగాహనా వారోత్సవాలలో భాగంగా తపాలా శాఖ డిపాజిటర్ లకు, ఖాతాదారులకు అందిస్తున్న వివిధ రకాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అలాగే తపాలా శాఖ డిపాజిటర్ ల లావా దేవీలన్ని మొబైల్ అనుసంధానం చేశామన్నారు. డిపాజిటర్ ల ఆర్థిక లావా దేవీలన్ని ఆన్ లైన్ చేయడం జరిగిందని వివరించారు. డిపాజిటర్ లు ఎప్పటికప్పుడు తమ ఆర్థిక లావాదేవీలు ఆన్ లై న్ ద్వారా పర్సనల్ వేరిపీకేషన్ చేసుకోవాలని తపాలాశాఖ డిపాజిటర్ లకు ఏలూరుజిల్లా తపాలా శాఖ కార్యాలయ ప్రధానాధికారి గంగాధర్ విజిలెన్స్ వారోత్సవాల సందర్భంగా తెలియజేసారు.

Related posts

పకడ్బందీగా టెన్త్ పరీక్షలు:విద్యార్ధులూ ఆందోళనకు గురికావద్దు

Satyam NEWS

పాఠశాలల్లో మిషన్ భగీరథ వాటర్ ఏర్పాటు చేయాలి: SFI

Satyam NEWS

వైసిపి పాలనలో అభివృద్ధిలో అథోగతి

Bhavani

Leave a Comment