38.2 C
Hyderabad
April 29, 2024 11: 43 AM
Slider మహబూబ్ నగర్

పాఠశాలల్లో మిషన్ భగీరథ వాటర్ ఏర్పాటు చేయాలి: SFI

#middaymeals

అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మిషన్ భగీరథ వాటర్ ఏర్పాటు చేయాలని SFI డిమాండ్ చేసింది. తాగునీరు లేక పాఠశాలలో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని ఎస్ఎఫ్ఐ నాగర్ కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షుడు డి. శేఖర్ అన్నారు. నాగర్ కర్నూల్ లోని గాంధీ స్కూల్ లో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎస్ఎఫ్ఐ నాయకులు నేడు పరిశీలించారు.

ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనంలో మెనూ పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. గాంధీ స్కూల్ లో విద్యార్ధులు నీరులేక బోరు నీరు తాగుతున్నారని అన్నారు. తక్షణమే అన్ని ప్రభుత్వ పాఠశాల్లో మిషన్ భగీరథ వాటర్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాత్రూం లేక టాయిలెట్లు లేక అనేక పాఠశాలలు లో విద్యార్ధినీవిద్యార్ధులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు నాయక్, చిన్న, నాయుడు, రాజేష్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

రోటారాక్ట్ – రోటరీ ఆధ్వర్యంలో స్కూలు పిల్లలకు బట్టల పంపిణీ

Satyam NEWS

కాంగ్రెస్ పార్టీ నిషేధిత ఉగ్రవాద సంస్థ అనుకుంటున్నారా?

Satyam NEWS

నీట్‌, జేఈఈ సాధనకు ‘కోటా’ స్టడీ మెటీరియల్‌ సిద్ధం

Satyam NEWS

Leave a Comment