32.2 C
Hyderabad
May 16, 2024 15: 05 PM
Slider ఖమ్మం

ఎస్‌సి,ఎస్‌టి ల అభివృద్దికి ప్రత్యేక నిధులు

#collector

ఎస్సి ప్రత్యేక అభివృద్ధి ఫండ్ ను అమలుచేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో అధికారులతో ఎస్సి ప్రత్యేక అభివృద్ధి ఫండ్ అమలును శాఖల వారిగా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనాభా ప్రాతిపదికన ఎస్సి, ఎస్టీ ల అభివృద్ధికి వివిధ శాఖల ప్రత్యేక నిధులు ఖర్చు చేయాలన్నారు. వెనుకబడ్డ ఎస్సి, ఎస్టీల అభివృద్ధి పై ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఎస్సి, ఎస్టీ ల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. నిధులను మళ్లించడం చేయరాదన్నారు. రెగ్యులర్ బడ్జెట్ లోను ఎస్సి, ఎస్టీ లకు నిధులు కేటాయించాలన్నారు. ప్రభుత్వ ప్రతి పథకంలో వారిని కవర్ చేయాలన్నారు. శాఖలకు వారి వారి బడ్జెట్ కేటాయింపు, పథకాల వారిగా ఖర్చు వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.  వ్యవసాయం, ఉద్యానవన శాఖల్లో ఎంత మంది ఎస్సి, ఎస్టీలకు లబ్ది చేకూర్చింది అడిగి తెలుసుకున్నారు. ఇంజనీరింగ్ శాఖల్లో చేపడుతున్న పనుల్లో ఎస్సి, ఎస్టీ కాలనీలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎస్సి, ఎస్టీ లకు అవగాహన కల్పించి, ప్రభుత్వ పథకాల ఫలాలు వారికందెలా చైతన్యం కల్గించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్. మధుసూదన్, డిఆర్వో శిరీష, జిల్లా సాంఘీక సంక్షేమ అధికారి కె. సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

జెర్సీ ఆవుకు ఒకే ఈతలో రెండు దూడలు

Satyam NEWS

తెలంగాణ ఉద్యోగ సంఘాలతో ఆర్టీసీ జేఏసీ సమావేశం

Satyam NEWS

అన్ని వర్గాల ప్రజా ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయం

Satyam NEWS

Leave a Comment