33.2 C
Hyderabad
May 15, 2024 21: 46 PM
Slider ఖమ్మం

దరఖాస్తుదారులకు సౌకర్యాలు కల్పించాలి

#liquor policy

2023-25 సంవత్సరానికి నూతన మద్యం పాలసీ ప్రకారం ఈ నెల 3 న నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్, స్థానిక ఎక్సైజ్ పోలీస్ స్టేషన్-1 ను సందర్శించి, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చెందిన సహాయక కేంద్రం, దరఖాస్తుల స్వీకరణ కౌంటర్ లను ఆయన పరిశీలించారు.దరఖాస్తుదారులకు కావాల్సిన సదుపాయాలు కల్పించాలని ఆయన అన్నారు.

జిల్లాలో 122 మద్యం దుకాణాలకు గాను మంగళవారం నాటికి 26 దుకాణాలకు సంబంధించి 47 దరఖాస్తులు అందినట్లు ఆయన అన్నారు. దరఖాస్తులు ఈ నెల 18 సాయంత్రం 6.00 గంటల వరకు అన్ని పని దినాలలో స్వీకరిస్తారని కలెక్టర్ తెలిపారు.

Related posts

కామారెడ్డి జిల్లా కేంద్రానికి రానున్న ఎమ్మెల్యే రఘునందన్ రావు

Satyam NEWS

వరుణ్ తేజ్ వాల్మీకి టీజర్ కి సూపర్ రెస్పాన్స్

Satyam NEWS

కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు జూపల్లి అభినందన

Satyam NEWS

Leave a Comment