41.2 C
Hyderabad
May 4, 2024 17: 39 PM
Slider నల్గొండ

విద్యార్థులకు స్ఫూర్తిని కలిగించే పుస్తకాల వితరణ

#hujurnagar

విద్యార్థుల మేథో వికాసాన్ని పెంచుతూ,వారిలో స్ఫూర్తిని నింపేందుకు అక్షరాల లక్ష రూపాయలు విలువచేసే వ్యక్తిత్వ వికాస పుస్తకాలు అందించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు ‘కృషి ఫౌండషన్’ చైర్మన్ పోశం నర్సిరెడ్డి. తన కృషి ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవారంగంలో ముందు నిలిచిన కృషి ఫౌండషన్స్ చైర్మన్ పోశం నర్సిరెడ్డి హుజూర్ నగర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో తొమ్మిది,పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ పుస్తకాలు అందజేశారు.ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు,డాక్టర్ తాటికొండ వేణుగోపాల్ రెడ్డి వ్రాసిన వ్యక్తిత్వ వికాస పుస్తకాలు(పీస్ ఆఫ్ మైండ్,ఒత్తిడిని జయించండి,విజయం మీదే,బి కాన్ఫిడెన్స్,బి పాజిటివ్,సక్సెస్ సక్సెస్) పుస్తకాలను విద్యార్థులకు గురువారం అందజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువులో రాణించాలంటే ఏకాగ్రత, క్రమశిక్షణ,సమయపాలన,లాంటి ఎన్నో అంశాలు దోహద పడుతాయని,ఎలా చదవాలి?ఎలా తమ లక్ష్యాన్ని నిర్ధేశించుకోవాలో వివరంగా విశ్లేషించిన ఈ పుస్తకాలు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే సిలబస్ గా నిలుస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, విద్యార్థులకు స్ఫూర్తిస్తూ ప్రసంగించారు.

అన్ని దానాలలో అన్నదానం,విద్యాదానం మిన్న అంటారు.విద్యార్థులకు స్ఫూర్తిని ఇచ్చే పుస్తకాలను,వారి భవిష్యత్తును తీర్చిదిద్దే ఆశయంతో అందిస్తున్నామని ‘కృషి ఫౌండేషన్’ చైర్మన్ పోశం నర్సిరెడ్డి. అన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

వ‌చ్చే ఉగాది నాటికి కొత్త జిల్లాలోకి పోలీస్ వ్య‌వ‌స్థ అంతా…!

Satyam NEWS

(Over-The-Counter) & Does Taking Valium Lower Blood Pressure Quick Remedies To Lower High Blood Pressure

Bhavani

వ్యాక్సిన్ గురించి అవగాహన కల్పించిన వనపర్తి జిల్లా ఎస్పీ

Satyam NEWS

Leave a Comment