తెలుగు చిత్ర సీమలో మరో విషాదం చోటు చేసుకుంది. తమిళ, తెలుగు చిత్రాలలో హాస్య నటుడిగా ప్రసిద్ధి చెందిన నటుడు విశ్వేశ్వర రావు (62) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధ పడుతూ మంగళవారం తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు బుధవారం జరగనున్నాయి. ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం చెన్నై సమీపాన సిరుశేరి లోని ఆయన నివాసంలో ఉంచారు. ఆయన స్వస్థలం ఏపీ లోని కాకినాడ. ఆయన పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించారు. దర్శకునిగా, నిర్మాత గానూ వ్యవహరించారు.
previous post