40.2 C
Hyderabad
May 6, 2024 17: 23 PM
Slider ప్రత్యేకం

వ‌చ్చే ఉగాది నాటికి కొత్త జిల్లాలోకి పోలీస్ వ్య‌వ‌స్థ అంతా…!

#vijayanagaramSP

శుభ‌కృత్ నామ సంద‌ర్బంగా విజ‌య‌న‌గ‌రం జిల్లా దీపిక వెల్ల‌డి…!

కొత్త ఏడాది శుభ‌కృత్ సంవ‌త్స‌రాన‌..ఏపీలోని విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్పీ ఇచ్చిన స‌మాదానం…క‌ర్త‌వ్య దీక్ష‌కు నిద‌ర్శ‌నంగా నిలిచింద‌ని అని అంటోంది…స‌త్యం న్యూస్ నెట్. తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది సంద‌ర్బంలో మ‌రోవైపు ప్ర‌స్తుతం ఉన్న విజ‌య‌న‌గ‌రం జిల్లా విభ‌జ‌న అవుతున్న త‌రుణంలో స‌త్యం  న్యూస్.నెట్… ఎస్పీని ఇంట‌ర్య్వూ చేసింది.ఆ వివ‌రాలు..మీ కోసం.

ప్ర‌తినిధి-నమ‌స్తే మేడం..ముందుగా  ఉగాది శుభాకాంక్ష‌లు.

ఎస్పీ-ఓ థాంక్యూ అండీ…మీకు కూడ‌ను.

ప్ర‌తినిధి- బైఫ‌రికేష‌న్ గురించి అదే జిల్లా విభ‌జ‌న అవుతున్న త‌రుణంలో  శాఖా పరంగా మార్పులు లేంటి..?

ఎస్పీ- పార్వ‌తీపురం మ‌న్యం జిల్లాకి కొత్త‌గా పోలీస్ శాఖ ఏర్పాటు  అవుతోంది… అక్క‌డ వైట్ హౌస్  కేంద్రంగా ఆ జిల్లా పోలీస్ శాఖ కార్యాల‌యం  ఏర్పాటు అవుతుంది.

ప్ర‌తినిధి.- మ‌రి విజ‌య‌న‌గ‌రంలో ఉన్న  ఏఆర్, ఎస్టీఎఫ్‌, హొం గార్డు వంటి విభాగాలో…?

ఎస్పీ-ఏఆర్ ప్ర‌స్తుతం ఇక్క‌డే ఉంటుంది..ఎస్టీఎప్.కూడా ప్ర‌స్తుతం విజ‌య‌న‌గ‌రం జిల్లాలోన ఉంటుంది. కేవ‌లం స్పెష‌ల్ పార్టీ ఫోర్స్   కొత్త‌గా రిక్రూట్ అవుతారు.

ప్ర‌తినిధి.- మ‌రి ప్ర‌స్తుతం..దాదాపు 2 వేల మంది సిబ్బంది ఉన్నారు క‌దా…కేడ‌ర్ త‌ర‌హాలో ఎవ్వ‌రైనా  బ‌దిలీ అవుతారా.?

ఎస్పీ- ప్ర‌స్తుతం విజ‌య‌న‌గ‌రం జిల్లాలో  పార్వ‌తీపురం, బొబ్బిలి,విజ‌య‌న‌గ‌రం డివిజ‌న్లు ఉన్నాయి…కొత్తగా పార్వ‌తీపురం మ‌న్యం జిల్లాలో పార్వ‌తీపురం తో పాటు బ‌లిజిపేట‌,రాజాం కలుస్తాయి.

ప్ర‌తినిధి-శాఖా సిబ్బంది  అవ‌స‌రం ఎంత ఉంటుంది..?

ఎస్పీ- ప్ర‌స్తుతం ఎక్క‌డి సిబ్బంది అక్క‌డే  ఉంటార‌ని…కొత్త జిల్లా ఏర్ప‌డినా… ఆ జిల్లాలోనే ఉంటారు. సీఐ స్థాయి పోలీస్ అధికారి బ‌దిలీ మాత్రం ఉంటుంది.

ప్ర‌తినిధి-మీరు కొత్త జిల్లాకు ఎస్పీ గా వెళ్ల‌నున్నారా…మేడం..?

ఎస్పీ-  ఏమో తెలియ‌దు…ఎక్క‌డ ఇస్తే  అక్క‌డ ప‌ని చేస్తాను.

ప్ర‌తినిధి.- మీ భ‌ర్త ఏపీఎస్పీ 5 వ బెటాలియ‌న్ క‌మాండెంట్… ఆయ‌న  విజ‌య‌న‌గ‌రం జిల్లాకు ఎస్పీగా రానున్నార‌ని స‌మాచారం  దీనికి మీ స‌మాధానం.?

ఎస్పీ- అవునా..ఏమో నాకు తెలియ‌దు…ఇద్ద‌రికి ఎక్క‌డ ఇచ్చినా చేస్తాం…ఇద్ద‌రిదీ డ్యూటీ మైండే.

ప్ర‌తినిధి.- స‌రే మేడం..న‌మ‌స్తే….ఇక ఉంటాను…శుభ‌కృత్ కొత్త  ఏడాది ఐ మీన్  ఉగాది శుభాకాంక్ష‌లు అండీ.

ఎస్పీ- ఓ థాంక్స్…మీకు కూడా.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా త్వరలో పాదయాత్ర

Satyam NEWS

ఆత్మీయ బంధం

Satyam NEWS

మావోయిస్టు నేత పటేల్ సుధాకర్ రెడ్డి కి ఘనంగా నివాళి

Satyam NEWS

Leave a Comment