Slider మహబూబ్ నగర్

రైతుల పట్ల కాంగ్రెస్ విధానానికి బీఆర్ఎస్ నిరసన

#BRS protest

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఉచిత కరెంటు పై చేసిన వ్యాఖ్యల ను నిరసిస్తూ మహబూబ్ నగర్ లోని తెలంగాణ చౌరస్తాలో వేలాది మంది రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్.

రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ విధానాలను నిరసించారు. రైతుల జోలికొస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో రైతులకు పూర్వవైభవాన్ని తీసుకవచ్చారన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఉచిత విద్యుత్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల మహిళ రైతులు ఆగ్రహంతో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను కాళ్లతో తన్ని తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ అని నినదించారు. గతంలో వ్యవసాయం దండుగా అని , కరెంట్ అడిగిన పాపానికి రైతులను కాల్చి చంపిన తెలంగాణలో కనపడకుండా పోయిన నాయకుడి శిష్యులు రైతుల పట్ల నేడు అదే అక్రోషం వ్యక్తం చేస్తున్నారని మంత్రి డాక్టర్ వి . శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్గౌడ్ ,డిసిసిబి ఇన్చార్జి చైర్మన్ వెంకటయ్య, ముడా చైర్మన్ గంజి వెంకన్న ముదిరాజ్, మున్సిపల్ చైర్మన్ కేసి నర్సింహులు, జిల్లా రైతు బంధు సమన్వయ కమిటీ చైర్మన్ గోపాల్ యాదవ్ , జిల్లా గొర్రె కాపరుల సహకార సంఘం అధ్యక్షులు శాంతన్న యాదవ్, వివిధ మండలాల

BRS పార్టీ అధ్యక్షులు, జెడ్పిటిసిలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు ,కౌన్సిలర్లు, పార్టీ నాయకులు ,కార్యకర్తలు పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

దారుణం…దారుణం: కన్న తల్లిని చంపిన కొడుకు…

Satyam NEWS

వాళ్ళిద్దరు కలిశారంటే జగన్ పార్టీ పని అవుట్

Satyam NEWS

ఆస్పత్రిలో సాధారణ ప్రసవాలు పెంచాలి

Satyam NEWS

Leave a Comment