37.2 C
Hyderabad
May 2, 2024 12: 31 PM
Slider నల్గొండ

ఆస్పత్రిలో సాధారణ ప్రసవాలు పెంచాలి

#lingagiri

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ లింగగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం గురువారం జరిగింది.

ఈ సమావేశంలో హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎంపిపి గుడేపు శ్రీనివాస్ మాట్లాడుతూ ఆస్పత్రిలో సాధారణ ప్రసవాలు పెంచాలని,ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా గర్భిణీలకు సాధారణ ప్రసవం జరిగే విధంగా వారికి ఉచిత పరీక్షలు నిర్వహించడంతో పాటు కాన్పు జరిగిన వెంటనే కెసిఆర్ కిట్ ను అందించడం జరుగుతుందని అన్నారు.లింగగిరి వైద్య సిబ్బంది ఆపరేషన్లు కాకుండా సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ నాగు నాయక్,ఎంపిడిఓ శాంతకుమారి,సర్పంచ్ లు కర్నాటి అంజి రెడ్డి,గుండెపంగు సౌజన్య,పత్తిపాటి రమ్య నాగరాజు,సీనియర్ అసస్టెంట్లు సూర్య నారాయణ,రాజేద్రప్రసాద్ పిహెచ్ఎన్ నూర్జహాన్ బేగం తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

అంగరంగవైభవంగా కొత్త సచివాలయం ప్రారంభోత్సవం

Bhavani

డెత్ హంటర్స్: విద్యుదాఘాతానికి ఎంపీటీసీ బలి

Satyam NEWS

Over|The|Counter < What Vitamin Supplements Are Good For High Blood Pressure

Bhavani

Leave a Comment