Slider మహబూబ్ నగర్

వనపర్తి జిల్లాలో  తగ్గిన రోడ్డు ప్రమాదాలు

#wanaparthypolice

వనపర్తి జిల్లాలో నేరాలు, రోడ్డుప్రమాదాలు నియంత్రించడంలో  వనపర్తి జిల్లా పోలీసులు విజయం సాధించారని వనపర్తి జిల్లా ఎస్పీ కె.అపూర్వరావు వార్షిక సమావేశం ద్వారా చెప్పారు. వనపర్తి జిల్లా వార్షిక నివేదికను ఎస్పీ  ప్రకటించారు.

గత ఏడాది కన్న ప్రస్తుత సంవత్సరంలో నేరాల సంఖ్య ఘనణీయంగా తగ్గిందని ఇందులో హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, మహిళలపై దాడులు, చైన్ స్నాచింగ్ లు నియంత్రించడంలో వనపర్తి జిల్లా పోలీసులు ముందున్నారని తెలిపారు.  రోడ్డు ప్రమాదాలకు సంబంధించి పోలీసులు ముందస్తు జాగ్రత్తలు  తీసుకోవడంతో గత  సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో  ప్రమాదాలు గణనీయంగా తగ్గాయని ఎస్పీ  విలేకరుల సమావేశంలో తెలిపారు.

వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో 2022 మొత్తం కేసులు: 2020 – 2346, 2021 -2086, 2022- 1707. వనపర్తి జిల్లాలో ఇప్పటివరకు అన్ని పొలిస్టేషన్లలో  నీనేస్తం కార్యక్రమంలో భాగంగా  ప్రజల  సహకారంతో 810 సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. మహిళల రక్షణలో భాగంగా ఈవ్ టీజింగ్ నిరోధానికి ఏర్పాటు చేసిన షీటీం లు 95 అవగాహన సదస్సులు నిరిహించి, 15500 మంది విద్యార్థులకు అవగాహన  కల్పించారు. ఇసుక అక్రమ  రవాణాకు సంబంధించి జిల్లాలో 73 కేసులు నమోదు చేసి,113 మందిని అరెస్టు చేశామన్నారు. జిల్లాలో ఇ -పెట్టీ  కేసులు 2031 కేసులు నమోదు చేశామన్నారు.

జిల్లాలో ఓపెన్ సిట్టింగ్ చేసిన 166 మందిపై కేసులు నమోదు చేశామని,మైనర్ డ్రైవింగ్ చేసి వాహనాలు నడిపిన 189 మంది పిల్లల తల్లిదండ్రులకు  జరిమానా విధించి కౌన్సెలింగ్ నిర్వహించామని తెలిపారు. ఆపరేషన్ ముస్కాన్ -33 & ఆపరేషన్ స్మైల్ -32 ద్వారా 65 మంది బాలకార్మికులను గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిరిహించి 171 మంది పిల్లలను బాలసధన్ కు పంపించామని ఎస్పీ అపూర్వ రావు తెలిపారు.

జిల్లాలో పోలీసు కళాబృందం 10 అవగాహన సదస్సులు నిరిహించి మూడ నమ్మ కాలు, డయల్ 100, మధ్యం సేవించి వాహనాలు నడపడం వలన జరుగు అనర్థాల గురించి, అలాగే సైబర్ నేరాలు,  బాల్యవివాహాలు, మూఢనమ్మకాలు, పలు ముఖ్యమైన అంశాలపై ప్రజలకు అవగాహన  కల్పిస్తున్నామన్నారు. జిల్లా అంతట కార్డర్ అండ్ సెర్చ్ కార్యక్రమాలు 01 నిర్వహించామని, జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందికి 2 సార్లు మెగామెడికల్ క్యాంపుల  ద్వారా అన్ని రకాల పరీక్షలు చేశామని తెలిపారు.

లోక్ అదాలత్ ద్వారా 1136 కేసులు పరిష్కరించామని తెలిపారు. కమ్యూనిటీ పోలీసింగులో భాగంగా జిల్లాలో 500 మంది   ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహ్య దారుడ్య పరిక్షలకు  ఉచిత   శిక్షణ ఇప్పించామన్నారు. సైబర్ నేరాల నియంత్రణలో భాగంగా పోలీసుకళా బృందంచే అవగాహన కార్యక్రమాలు చేశామన్నారు. 2023 సంవత్సరంలో ప్రజలందరికీ మంచి కలగాలని ఆశిస్తూ స్నేహపూర్వక పోలీసు విధానాన్ని అవలంబిస్తామని తెలిపారు.

వనపర్తి జిల్లా పోలీసు బాధ్యతాయుతంగా, జవాబుదారితనంతో  పనిచేస్తూ ప్రజల ధన, మాన, ప్రాణాల రక్షణ కోసం అనుక్షణం పనిచేస్తామని చెప్పారు. జిల్లా పోలీసుశాఖ తరపున జిల్లా ఎస్పీ  కె.అపూర్వరావు  జిల్లా ప్రజలకు, పత్రిక మీడియా ప్రతినిధులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

“సత్యం గెలిచింది-యుద్ధం మొదలైంది”

Satyam NEWS

కెసిఆర్ ను గద్దె దించడమే లక్ష్యం

Murali Krishna

26 స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు

Murali Krishna

Leave a Comment