26.7 C
Hyderabad
April 27, 2024 08: 59 AM
Slider ముఖ్యంశాలు

26 స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు

#clean survey

రాష్ట్రంలోని పట్టణాలు మరోసారి దేశంలో తమ ప్రత్యేకతను చాటాయని. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు స్వచ్ఛ సర్వేక్షన్ – 2022 అవార్డులు దక్కాయి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రకటించిన అవార్డుల జాబితాలో తెలంగాణ పట్టణాలకు చోటు దక్కింది.  75 సంవత్సరాల స్వాతంత్ర్య భారత ఆజాదీ కా అమృత్ ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి స్వచ్ఛ సర్వేక్షన్ విభాగంలో 16 అవార్డులతో పాటు ఐఎస్ఎల్ విభాగంలో మరో మూడు అవార్డులను గతంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రధానం చేసింది. ఇప్పుడు కాగజ్ నగర్, జనగామ, అమన్ గల్, గుండ్లపోచంపల్లి, కొత్తకోట, వర్దన్నపేట, గ్రేటర్ వరంగల్  పురపాలికలకు ఫాస్టెస్ట్ మూవింగ్ సిటీ కేటగిరిలో కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించడం విశేషo.  వివిధ విభాగాలలో మొత్తం 26 అవార్డులను తెలంగాణ రాష్ట్రం సాధించింది. స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డుల కోసం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ జాతీయ స్థాయి శానిటేషన్‌ సర్వేను జూలై-2021 నుంచి జనవరి-2022 వరకు నిర్వహించిoది.

పారి శుద్ధ్యం, మున్సిపల్‌ ఘనవ్యర్థాల నిర్వహణ, అవగాహనపై దేశం వ్యాప్తంగా ఉన్న 4355 పట్టణ స్థానిక సంస్థల్లో స్వచ్ఛ సర్వేక్షన్ సర్వే నిర్వహించింది. అవార్డులకు ఎంపిక చేయడానికి 90 అంశాలను ప్రాతిపదికన తీసుకున్నారు. సాలిడ్‌ వేస్ట్ మేనేజ్‌మెంట్‌, లిట్టర్‌ ఫ్రీ వాణిజ్య ప్రాంతాలు, కమ్యూనిటి లెవల్‌ కంపోస్టింగ్‌, ప్రజా మరుగుదోడ్లు, కమ్యూనిటీ టాయిలెట్ల నిర్వహణ, లిక్విడ్‌ వేస్ట్ మేనేజ్‌మెంట్‌, ప్రజల అవగాహన, సిటిజన్‌ ఎంగెజ్‌మెంట్‌, ఇన్నోవేషన్స్​‍లో సర్వే నిర్వహించారు. అవార్డుకు ఎంపికైన పట్టణాలు. ఆదిభట్ల,  బడంగ్‌పేట్‌ , భూత్పూర్‌ ,  చండూర్‌, చిట్యాల, గజ్వేల్‌,  ఘట్‌కేసర్‌,  హుస్నాబాద్‌,  కొంపల్లి,  కోరుట్ల,  కొత్తపల్లి,  నేరుడుచర్ల,  సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌, సిరిసిల్ల,  తుర్కయాంజల్‌,  వేములవాడ,  వరంగల్‌, వర్థన్నపేట, జనగామ,  కాగజ్‌నగర్‌,  కొత్తకోట,  గుండ్లపోచంపల్లి ,  అమన్‌గల్‌

Related posts

మారువేషాల్లో విజయవాడకు అంగన్వాడీలు

Bhavani

పాపులర్ జర్నలిస్టు TNR ఆవేదనాభరిత మనోగతం…

Satyam NEWS

వినాయకుడికి ప్రత్యేక పూజ చేసిన మాజీ మంత్రి కృష్ణయాదవ్

Satyam NEWS

Leave a Comment