27.7 C
Hyderabad
May 16, 2024 04: 24 AM
Slider నిజామాబాద్

దళారులకు అమ్ముకున్న వరి రైతులను కూడా ఆదుకోవాలి

#congressparty

ప్రభుత్వ నిర్వాకం వల్ల ఎంతో మంది రైతులు తమ వడ్లను దళారులకు అమ్ముకుని తీవ్రంగా నష్టపోయారని టీపీసీసీ సభ్యులు, బాన్స్ వాడ నియోజక వర్గ ఇంచార్జి కాసుల బాల్ రాజ్ అన్నారు. బాన్స్ వాడ నియోజక వర్గంలో కోటగిరి మండల కేంద్రంలో నేడు కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.

కాంగ్రెస్ పార్టీ పోరాటం ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చిందని ఆయన అన్నారు. ఇది టీపీసీసీ అధ్యక్షులు  రేవంత్ రెడ్డి విజయం అని కూడా ఆయన అన్నారు. యాసంగి వరి పంట వేస్తే ఉరి అని కెసిఆర్ అన్నారని ఆయన గుర్తు చేశారు. ఎవరైతే వరి  వేయలేరో వారికీ నష్ట పరిహారం ఒక ఎకరాకు కు 20000 వేల నష్ట పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

అధికారులు వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలని ఆయన అన్నారు. కొనుగోలు ప్రాంతాలలో ఇబ్బంది జరగకుండా అన్ని సదుపాయాలు కల్పించడానికి అధికారులు అన్ని చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన డిమాండ్ చేసింది.

అలాగే ఈ కార్య క్రమంలో కోటగిరి మండల అధ్యక్షులు షాహిద్ హుస్సేన్, మాజీ జడ్పీటీసీ పుప్పాల శంకర్, మాజీ సర్పంచ్ ఎంపీటీసీ మనోహర్, వేముల పల్లి సత్యం, వహీద్, అబ్బన, సాయిలు, ఉషం భూమన్న, సాయిలు, అహ్మద్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

జి. లాలయ్య సత్యం న్యూస్   జుక్కల్ నియోజకవర్గం

Related posts

బాధ్యతతో వ్యవహరించిన ఉద్యోగులకు కడప ఎస్ పి అభినందన

Satyam NEWS

అమెరికా లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా కాట్రగడ్డ అరుణ!

Bhavani

ఎలర్ట్: కరోనాపై అన్ని జిల్లాలలో అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

Leave a Comment