37.2 C
Hyderabad
May 2, 2024 11: 08 AM
Slider ప్రత్యేకం

బాదుడే బాదుడు: ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు

#APSRTC

బాదుడే బాదుడు అంటూ ఇప్పుడు మరో బాదుడు మొదలు పెట్టింది జగన్ ప్రభుత్వం. చెత్త పన్ను విధింపు, ఇంటిపన్ను పెంపు, కరెంటు చార్జీల పెంపుతో ఇప్పటికే జనంపై భారం మోపిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచింది. డీజిల్ ధరల పెరుగుదలతో ఛార్జీలు పెంచినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. పల్లె వెలుగు బస్సు కనీస ఛార్జీ రూ. 10 పెంచినట్లు తెలిపారు.

ఆర్టీసీ చార్జీలపై డీజిల్‌ సెస్‌ విధించారు. పల్లె వెలుగు బస్సుల్లో రూ. 2 ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో రూ. 5 పెంచినట్లు ఆర్టీసీ ఎండీ తెలిపారు. డీజిల్‌ బల్క్‌ రేటు విపరీతంగా పెరిగిందని ఆర్టీఎసీ ఎండీ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. రేపట్నుంచి పల్లె వెలుగు బస్సులో కనీస చార్జి రూ.10 ఉంటుందని ఆయన వెల్లడించారు. సెస్‌ పెంపు వల్ల ఆర్టీసీకి రూ.720 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని ఆర్టీసీ ఎండీ వెల్లడించారు.

Related posts

భారీ వర్షాల కారణంగా విద్యుత్ శాఖ అప్రమత్తం

Satyam NEWS

NEW How To Lower Blood Pressure Without Taking Medicine Instant Remedy For Bp High Teva 928 Pills Blood Pressure

Bhavani

అరసవల్లి సూర్యనారాయణుడిని తాకిన సూర్య కిరణాలు

Satyam NEWS

Leave a Comment