32.2 C
Hyderabad
May 16, 2024 14: 57 PM
Slider ప్రత్యేకం

నాదెండ్ల మనోహర్ ను చూస్తే వారికి భయం

#Nadendla Manohar

పెద్ద మనుషులు చెప్పే సుద్దులు గానీ, ప్రతిపక్షాలు చేసే విమర్శలు గానీ అధికార వైసీపీకి పట్టవు. బూతులు మాట్లాడటం, అవినీతి కార్యక్రమాలు కొనసాగించడం, ప్రశ్నిస్తే అరెస్టు చేయడం అనే మూడు సూత్రాలను మాత్రం వైసీపీ పెద్దలు కచ్చితంగా అమలు చేస్తుంటారు. ఏపిలో జగన్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు… మరీ ముఖ్యంగా ఆ పార్టీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు అయితే ఏకంగా ఇసుక దోపిడిపై సాక్ష్యాధారాలతో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ఇచ్చారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అయితే వైసీపీ చేస్తున్న మందు దోపిడిపై ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచారు. కేంద్రానికి ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఇలా ఎవరైనా సాక్ష్యాధారాలతో సహా ఏదైనా అంశాన్ని నిరూపిస్తే వారిపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడం వైసీపీకి అలవాటు. మహిళలు గొంతు ఎత్తితే ఇక వారి క్యారెక్టర్ పై చిలవలు పలవలు చేసి మార్ఫింగ్ ఫొటోలతో దాడి చేస్తారు.

ఇలా మహిళలను కించపరిచినా కూడా ఏపీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోరు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి చేయడం కూడా భావ ప్రకటనా స్వేచ్ఛ అనే అంటారు తప్ప ఎలాంటి చర్యలు ఉండవు. అదే ఎవరైనా అధికార పార్టీని ప్రశ్నిస్తే మాత్రం వారికి తిప్పలు తప్పవు. జైలుకు వెళ్లేందుకు సిద్ధపడిన వారే వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేయాలి.

ఇటువంటి పరిస్థితుల్లో జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ ఎన్నో కుంభకోణాలను వెలికి తెస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అవినీతి, స్కాములు గురించి బయటకు తెలిసింది గోరంత. కానీ లోతుగా చూస్తే ప్రజాధనాన్ని, ప్రజల ఆస్తుల్ని సొంతానికి ఎలా రాసుకుంటున్నారో.. ఎలా దోచుకుంటున్నారో స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది.

జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్… వైసీపీ సర్కార్, జగన్ రెడ్డి దోపిడీని రోజుకొకటి చొప్పున బయటపెడతానని చాలెంజ్ చేశారు. ఆ ప్రకారం బయట పెడుతున్నారు. రెండు రోజుల్లో స్కాముల గురించి ఆధారాలతో బయట పెట్టారు. పిల్లలకు విద్యాకానుక పేరుతో బూట్లు, బ్యాగ్, డ్రెస్ క్లాత్ ఇస్తున్నారు. పిల్లలకు ఇచ్చేది కొంత అయితే .. నొక్కేది ఎంతో ఉందని మొదటి నుంచి ఆరోపణలు ఉన్నాయి.

పిల్లల పేరుతో రూ. 120 కోట్లు కొట్టేసినట్లుగా నాదెండ్ల మనోహర్ బయట పెట్టారు. ఢిల్లీలో ఈడీ కొన్ని కంపెనీలపై దాడులు చేసినప్పుడు ఇక్కడి కాంట్రాక్టుల గుట్టు బయటపడిందని.. త్వరలో ఈడీ ఇక్కడకూ వస్తుందని సంచలన విషయం బయట పెట్టారు. ఇక ఇండోసోల్ కంపెనీకి అప్పనంగా వేల ఎకరాలు కేటాయిస్తున్న వైనాన్ని రెండో రోజు బయట పెట్టారు.

ఇండోసోల్ కంపెనీ జగన్ రెడ్డి బినామీ. అది ప్రారంభించి ఏడాది కూడా కాలేదు. అయినా వేల ఎకరాల భూములు అప్పగిస్తున్నారు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే.. ఆ భూముల్ని నేరుగా సేల్ డీడ్ చేస్తున్నారు. ఇందు కోసం పారిశ్రామిక విధానాన్ని కూడా మార్చేశారు. అంటే సీఎం జగన్ రెడ్డి తన బినామీ కంపెనీ కి భూములు రాయించుకునేందుకు పారిశ్రామిక విధానం కూడా మార్చేశారన్నమాట.

జగన్ రెడ్డి కి ప్రజలు అధికారం ఇచ్చింది.. ఆస్తులు కాపాడమని కానీ.. ఇలా అడ్డగోలుగా అమ్మేసుకోవడం లేదా తన సొంతానికి రాయించుకోవడానికి కాదన్న విమర్శలు ఉన్నాయి. కానీ అదే చేస్తున్నారు. ముందు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల సంచలన స్కాములు బయట పెట్టనున్నారు. ప్రభుత్వం మారగానే వీటన్నింటిపై పక్కాగా కేసులు నమోదు చేయడం… అన్నింటినీ జగన్ రెడ్డితో పాటు అధికారుల్నీ ఎవర్నీ వదలకుండా బాధ్యుల్ని చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరో నాలుగు నెలల్లో అసలు కథ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Related posts

మేడే:జిహెచ్ఎంసి కార్మికులతో సహపంక్తి భోజనం

Satyam NEWS

బిఆర్ఎస్ లో చేరిన బిజెపి నేత

Satyam NEWS

కాలనీలు బస్తీల అభివృద్ధిలో సంక్షేమ సంఘాల పాత్ర కీలకం

Satyam NEWS

Leave a Comment