40.2 C
Hyderabad
May 5, 2024 15: 06 PM
Slider మహబూబ్ నగర్

ఎన్నికలలో చేసే ప్రతి ఖర్చును అభ్యర్థులు నమోదు చేయాలి

#elections

వనపర్తి ఐడిఓసి కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వనపర్తి నియోజకవర్గం నుండి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో వనపర్తి జిల్లా పోలీస్ అబ్జర్వర్ రాజీవ్ మల్హోత్రా, వ్యయ పరిశీలకులు రాజేందర్ సింగ్, జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ రక్షిత కె. మూర్తితో కలిసి ఎన్నికల ప్రవర్తన నియమావళి పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా జనరల్ అబ్జర్వర్ సోమేశ్ మిశ్రా మాట్లాడుతూ
ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ఖర్చు నిర్వహణకు సంబంధించిన నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.

అభ్యర్థులచే ఎన్నికల ఖర్చుల లెక్కల నిర్వహణ పద్ధతులను సూచించారు. ఖర్చులు నిమిత్తం బ్యాంక్ అకౌంట్ ఖాతా ద్వారా ఎన్నికల్లో చేసే ప్రతి ఖర్చుకు సరైన లెక్కలను అభ్యర్థి నామినేట్ చేసిన తేదీ నుండి నిర్వహించాలని సూచించారు. ఎన్నికల ఖర్చులు లెక్కలు ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 30 రోజులలోపు జిల్లా ఎన్నికల అధికారికి సమర్పించాలని సూచించారు. అభ్యర్థి నిర్వహించవలసిన ఎన్నికల ఖర్చుల రిజిస్టర్ పార్ట్-ఏ, పార్ట్-బి, పార్ట్-సి లను వివరించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి ఎన్నికల సంఘం నిర్దేశించిన ఖర్చుల మొత్తానికి లోబడే ఉండాలన్నారు. అభ్యర్థులందరూ నిజమైన సరైన ఎన్నికల ఖర్చులను ప్రతిరోజు నమోదు చేసి, సమర్పించాలని అన్నారు.

అభ్యర్థులందరికీ ఎన్నికల సంఘం తీసుకువచ్చిన సి- విజిల్ యాప్ పని తీరును వివరించారు. అదేవిధంగా ఎన్నికలలో అభ్యర్థులు ఏవైనా అనుమతులు తీసుకోవాలిసి ఉంటే సువిధ ద్వారా అన్ని రకాల ఎన్నికల అనుమతులను ఇవ్వబడతాయన్నారు. జిల్లాలో ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి, వి ఎస్ టి బృందాలు 24/7 పర్యటిస్తుంటాయని, ఎక్కడైనా ఎంసీసీ నిబంధనలకు విరుద్ధంగా పాల్పడితే వాటిపై చర్యలు ఉంటాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో వనపర్తి నియోజకవర్గంలో ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

దేశంలో దాడులకు ఉగ్రవాదుల భారీ ప్లానింగ్‌

Sub Editor

యూనియన్ బ్యాంక్ తాలూకా లోన్ మేళా

Satyam NEWS

వైభవంగా పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం

Satyam NEWS

Leave a Comment