40.2 C
Hyderabad
April 26, 2024 13: 55 PM
Slider హైదరాబాద్

మేడే:జిహెచ్ఎంసి కార్మికులతో సహపంక్తి భోజనం

#ArekepudiGandhiMLA

కరోనా వ్యాప్తి కారణంగా మేడేను సంతోషంగా జరుపుకోలేకపోతున్నామని లాక్‌డౌన్ నేపథ్యంలో ఆటోలు, లారీడ్రైవర్లు, అసంఘటిత కార్మికుల ఉపాధికి ప్రమాదంగా పరిణమించిందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు.

మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు ఆధ్వర్యంలో అశోక గార్డెన్ లో అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం (మేడే) నిర్వహించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసి కార్మికులకు భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు.  కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ తో కలిసి వారితో ప్రభుత్వ విప్ సహపంక్తి భోజనం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రామికుల కష్టాన్ని గుర్తించి గౌరవిద్దాం, కార్మికులంతా ఆరోగ్యం, సంపదతో బాగుండాలని  లాక్‌డౌన్‌ మార్గదర్శకాలు పాటించి కరోనాపై విజయం సాధించాలని పిలుపునిచ్చారు.  కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి పోరాడి సాధించిన రోజు ఈ మేడే అని అన్నారు.

కార్మిక, కర్షక, సంఘటిత, అసంఘటిత రంగాల  కార్మిక, ఉద్యోగ సోదరులందరికి మేడే శుభాకాంక్షలు తెలియచేసారు. అదేవిదంగా సొంత నిధులతో జీహెచ్ఎంసీ కార్మికులకు దాదాపు 200 మందికి భోజనం ఏర్పాటు చేసిన మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు ని ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి కూకట్పల్లి డివిజన్ అధ్యక్షుడు లక్ష్మి నారాయణ, తెరాస నాయకులు సాలయ్య , మోజేష్ , బాబు రావు , హరినాథ్ , కుమార స్వామి , నాగేశ్వర్ రావు , అబుల్,కృష్ణ, ఎల్లం  నాయుడు, చంద్రా మోహన్ సాగర్ , శ్రీనివాస్ సాగర్ ,  గడ్డం కృష్ణ,రాజు,రాము, జగదీశ్ గౌడ్ , రమేష్ , ఏశ్వంత్,ప్రవీణ్,కుమార్, రాధాబాయి ,లక్ష్మి,యకమ్మ, SRP నాయక్ SFA  లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పంచవటి హాస్పిటల్ పై కమిషన్ కు రాచాల ఫిర్యాదు

Satyam NEWS

విశాఖ పోర్టు ట్రస్ట్ లో స్వల్ప అగ్ని ప్రమాదం

Satyam NEWS

34 మంది మిలీషియా సభ్యుల లొంగుబాటు

Bhavani

Leave a Comment